Thursday, March 21, 2019

ఓట్లేసిన ప్రజలనే చంద్రబాబు ఏడిపిస్తున్నాడు: మోహన్‌బాబు…..

  1. సీఎం చంద్రబాబుపై సినీనటుడు మోహన్‌బాబు ధ్వజమెత్తారు.
  2. ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఏడిపిస్తున్నాడని మండిపడ్డారు.
  3. ఆయన అహంకారం పరాకాష్ఠకు చేరిందన్నారు.
  4. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహంకారం పరాకాష్ఠకు చేరిందని అన్నారు సినీనటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మోహన్‌బాబు.
  5. ప్రభుత్వం తమ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆయన తిరుపతిలో ఆందోళన చేపట్టారు.
  6. విద్యార్థులతో కలిసి తిరుపతి-మదనపల్లి మార్గంలో నడిరోడ్డుపైనే బైఠాయించారు. ఈ ఆందోళనలో మోహన్‌బాబు కుమారులు విష్ణు, మనోజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబంటే నాకు చాలా ఇష్టం. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు నా విద్యార్థులతో కలిసి పోరాడాను. కానీ ఓటు వేసి గెలిపించిన ప్రజలను నాలుగున్నరేళ్లుగా ఏడిపిస్తున్నాడు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు. పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇస్తున్నాడు. ఆవు-దూడ పథకం కింద గోవులను ఇస్తున్నాడు. కానీ విద్యార్థులకు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేకపోతున్నాడు. అదేంటని అడిగితే అమరావతి కడుతున్నా అంటున్నాడు. ఆవు-దూడ పథకం యాడ్‌లో ఎద్దును చూపించి ఆవుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎవడి డబ్బుతో ఆవులు ఇస్తున్నాడు. అది ప్రజల సొమ్ము

No comments:

Post a Comment