Friday, March 22, 2019

కార్యక్రమాల్లో విద్యార్థులకు అవకాశం….

కర్ణాటక న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
*గ్రామంలో ఏడురోజుల  సమాజ కార్య శిబిరాన్ని ఏర్పాటు…..
విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని ఉపయోగించుకువాలని డాక్టర్ శరణబసవ కోరారు.అన్ని కార్యక్రమాల్లో వీరిని భాగస్వామ్యం చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహాన కల్పించాలన్నారు.దీని వల్ల ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు తెలిసే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. రాయచూరు తాలూకాలోని యరగేరా పీజీ కేంద్రం,సమాజ కార్య అధ్యయన, పరిశోధన విభాగం హొసగోనవార గ్రామంలో ఏడురోజుల  సమాజ కార్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షత వహించిన డాక్టర్‌ శరణబసవ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వినియోగించుకోవడం వల్ల ఏ రంగంలోనైనా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఉపాధ్యాయురాలు ఫాతిమాబేగం మాట్లాడుతూ ఈ శిబిరం విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంపొందిస్తుందన్నారు. సమాజ కార్య సంయోజకుడు బజారప్ప, పంచాయతీ సభ్యుడు ఈరణ, గ్రామ పాఠశాల సమితి అధ్యక్షుడు ఆంజనేయ పాల్గొన్నారు.
                                                                                                         

No comments:

Post a Comment