Thursday, February 28, 2019

రైతులను నష్ట పెట్టడానికే వచ్చావా వరుణ దేవుడా…

ప్రకాశం దొనకొండ న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
  • పెట్టుబడి అంతా నష్టపోవాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరు…
  • బోర్ల కింద 80 ఎకరాల్లో వరి సాగు చేశారు…
  • ఎకరాకు రూ.60 నుంచి 70 వేల వరకు పెట్టుబడి పెట్టారు…..
అకాల వర్షం అన్నదాతల కష్టాన్ని నేలపాలు చేసింది. ముంచుకొచ్చిన వరుణుడు అన్నదాతలను ఆందోళనకు గురిచేశాడు.  మండలంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా గాలులు మొదలై వడగండ్ల వాన కురిసింది. దొనకొండ మండలంలో 80 ఎకరాల్లో బొప్పాయి తోటలను సాగు చేశారు. ఎకరాకు రూ.60 నుంచి 70 వేల వరకు పెట్టుబడి పెట్టారు. మరో పది రోజుల్లో కాయలు కోతకు రానున్నాయి.ఇంతలో వర్షం రాగా కాయ మొత్తం రాలిపొయింది కొందరు రైతులకు చెందిన మిర్చి తడిసి పోయింది. పాకాలలో పొగాకు సాగు చేశారు. ప్రస్తుతం మండెలపై ఉంది. వర్షంతో పొగాకు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు విశ్వప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల కందులు కల్లాల్లో ఉండగా.. అవికాస్తా తడిసి పోయాయి.

దివ్యాంగులు ప్రతిభావంతులు కావాలనే…


ఒంగోలు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
  • అంధులకు సంబంధించి ఎనిమిది ఉద్యోగాలు,…
  • మార్చి 31వతేదీలోగా అర్హులైన విభిన్న…
  • ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు…
వ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2018-19కి సంబంధించిన షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంధులకు సంబంధించి ఎనిమిది ఉద్యోగాలు, బధిరులకు రెండు పోస్టులు కేటాయించారు. మార్చి 31వతేదీలోగా అర్హులైన విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు బి.సింగయ్య తెలిపారు. అంధుల కోసం జూనియర్‌ సహాయకులు 1, టైపిస్టు 2, జూనియర్‌ స్టెనో టైపిస్టు 1, మ్యాట్రన్‌ కం స్టోర్‌ కీపర్‌ 1, ల్యాబ్‌ టెక్నిషియన్‌ 1, ఆఫీస్‌ సబార్డినేట్‌ 1చొప్పున పోస్టులు ఉన్నాయన్నారు. బధిరులకు జూనియర్‌ స్టెనో 1, ఎంపీహెచ్‌ఏ స్త్రీ కేటగిరీలో ఒక పోస్టు ఉందని వివరించారు. దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎక్కడైనా ఉన్నాడా ఈ సాహసవీరుడు….


అద్దంకి న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు: 
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
  •  ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ..
  • పోలియో వ్యాధి బారిన పడి మిగిలిన వాళ్లలా ..
  •  చెన్నై పట్టణం నుంచి భూటాన్‌ వరకు సైకిల్‌యాత్ర చేయాలని ..
  • సంతోష్‌ కుమార్‌ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకున్నారు….
చెన్నైలో నివసించే తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం అతను. తండ్రి దర్జీగా పని చేస్తుండగా తల్లి ఇస్త్రీ బండి నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి కుమారుడు సతీష్‌ కుమార్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కొంతకాలం పనిచేశారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చెన్నైలోని అన్నవేలాంగిని పాఠశాలలో పని చేస్తున్నారు.  ఈ క్రమంలోనే పోలియో వ్యాధి బారిన పడి మిగిలిన వాళ్లలా జీవితాలను గడప లేకపోతున్న కొందరిని అతను చూశారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణం నుంచి భూటాన్‌ వరకు సైకిల్‌యాత్ర చేయాలని సంతోష్‌ కుమార్‌ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకున్నారు. మధ్యలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, ఒడిశా, పశ్చిమ్‌బంగ, జార్ఖండ్‌, బిహార్‌, నేపాల్‌ మీదుగా భూటాన్‌ చేరుకునేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. సంతోష్‌ కుమార్‌ 3232 కి.మీ. దూరాన్ని ఏప్రిల్‌ మొదటి సతీష్‌ కుమార్‌ గతేడాది మే నుంచి జూన్‌ మాసం మధ్యలో చెన్నై నుంచి న్యూఢిల్లీకి సైకిల్‌ యాత్ర చేశారు. అప్పుడు 28 రోజుల పాటు 2400 కి.మీ. ప్రయాణం సాగింది. సేవా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలనే తలంపుతో ఈ పర్యటన సాగిస్తున్నట్టు ఆయన వివరించారు. భవిష్యత్తులో భారత్‌ నుంచి యూరప్‌నకు సైకిల్‌ యాత్ర చేస్తానంటున్నారు  సంతోష్‌ కుమార్‌.

సామాన్యుడిపై పెనుభారం పెడుతున్న ప్రభుత్వం……

మరోమారు వంట గ్యాస్ ధరలు మంట పుట్టించనున్నాయి. డీజిల్‌, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ సబ్సిడీ గ్యాస్‌ ధరను మరోసారి పెంచాయి. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగటంతో ధరాఘాతం సామాన్యులకు శరాఘాతంగా మారింది .
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, విదేశీ మారకం విలువలో ఒడిదొడుకుల నేపథ్యంలో ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. ఒక్కో సబ్సి డీ సిలిండర్‌పై రూ.2.08, సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.42.5 పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) గురువారం తెలిపింది. వరుసగా గత మూడునెలలు వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి.కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా తిరిగి ధరల పెంపు జరుగుతోంది.ప్రస్తుతం ఏటా 12 వంట గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నది.
ప్రస్తుతం పెరిగిన చమురు ధరలపై పన్ను ప్రభావంతో గ్యాస్ సిలిండర్ ధరల పెంపు తప్పని సరైందని ఐవోసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.493.53 ఉండగా, మార్చి ఒకటో తేదీ నుంచి పెరిగిన ధరలతో రూ.495.61 కానుంది. ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ.701.50కు పెరగనుంది .

పార్టీ నేతలతో సీ ఎం టెలీకాన్ఫరెన్స్

గుంటూరుజిల్లా: అమరావతి: ముఖ్యాంశాలు…
  • మోది రాకను నిరసిస్తూ ఎక్కడికక్కడ ధర్మపోరాట నిరసనలు తెలపుట…
  • తెలుగుదేశం పార్టి నేతలతో సీ ఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • ఇవాళ మోదీ విశాఖ పర్యటనపై చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్  లో మాట్లాడారు.
  • మోది రాకను నిరసిస్తూ ఎక్కడికక్కడ ధర్మపోరాట నిరసనలు తెలపాలని చంద్రబాబు నేతలకు సూచించారు.

నేడు విశాఖలో మోదీ సభ…

విశాఖపట్నం న్యూస్‌టుడే:
  • సభకు 50వేల మందికి పైగా వస్తారని అంచనా….
  • బందోబస్తులో పాల్గొనే వారి సంఖ్యను 2,460కి పెంచారు….
  • విశాఖ రైల్వే మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ‘ప్రజా చైతన్య సభాకు భారీబందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రేహౌండ్స్,ఆక్టోపస్ తదితర పేత్యేక దళాలను కుడా రంగంలోకి దింపారు.బందోబస్తులో పాల్గొనే వారి సంఖ్యను 2,460కి పెంచారు.సభకు 50వేల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు.దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.గత నెల గుంటూరులో మొదటి ప్రజా చైతన్య సభలో మోదీ ఎలాంటి వరాలు కురిపించలేదు.ప్రత్యేక హోదా,విభజన హామీల్ అమల్లో కేంద్ర ప్రభుత్వం ఘొరంగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భాజపా శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమ్మవుతున్నాయి.విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను మంజూరు చేయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.సాక్షాత్తూ రైల్వే ఉద్యోగులతో సహా పలు సంఘాలవరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

విద్యార్థినిపై విద్యార్థులు అఘాయిత్యం…

కడప న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
  • పదో తరగతి విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు అఘాయిత్యం
  • బయటకు చెబితే పరీక్షలలో ఫెయిల్ చేస్తామంటూ బెదిరింపులు.
 కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది.పదో తరగతి విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు అఘాయిత్యం చేశారు.దీనిపై స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వారు ఆ విద్యార్థినిని బెదిరించారు.ఈ విషయం బయటకు చెబితే పరీక్షలలో ఫెయిల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగింది.కాగా మనస్తాపం చెందిన విద్యార్థిని స్కూలు మూడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేసుకుంది. పైనుంచి పడటం వలన విద్యార్థిని కాళ్లు,నడుము విరిగి పోయాయని వైద్యులు తెలిపారు.

ప్రాణాలకు తెగించి వేటకు వెళ్తున్నాం…..

అల్లూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు:
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
  • నెలకు రూ.4 వేలు ఇవ్వడం వల్ల జీవనం కష్టంగా ..
  • చెన్నై నుంచి వచ్చే పెద్దబోట్ల వల్ల మా వలలకు ఇబ్బందిగా ఉందని..
చేపల వేట నిషేధ కాలంలో రెండు నెలల పాటు ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న జీవన భృతిని రూ.10 వేలకు పెంచాలని మత్స్య, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్రీధర్‌ను మత్స్యకారులు కోరారు. కోస్తా తీర ప్రాంతంలో పల్లెకారులందరూ చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్నామని.. నెలకు రూ.4 వేలు ఇవ్వడం వల్ల జీవనం కష్టంగా మారిందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంట పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు రవీంద్రనాథ్‌ఠాగూర్‌, మత్స్యశాఖ జేడీ బలరాం, సహాయ సంచాలకులు నాగభూషణం, చంద్రశేఖర్‌, ఎంపీడీవో సుజాత, పంచాయతీ కార్యదర్శి సురేష్‌ ఉన్నారు.

మహిళా భద్రత కోసం శక్తి

గుంటూరుజిల్లా: ముఖ్యాంశాలు:
  • ట్రాఫిక్ డి ఎస్.పి కె. సుప్రజ ఇన్‌చార్జ్ గా వ్యవహరించుట. 
  • అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు…
మహీళల భద్రత కోసం జిల్లాలో శక్తి టీం ఏర్పాటు చేశారు. అధికారులు ఈ విభాగానికి గుంటూరు అర్బన్ జిల్లా ట్రాఫిక్ డి ఎస్ పి కె. సుప్రజ ఇన్‌చార్జ్ గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భముగా నిర్వహించిన సమక్షంలో టీం సభ్యులకు తీసుకోవాల్సిన కార్యాచరణ గురించి వివరించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని, మహిళలు భద్రత కోసం కృషి చేయాలని టీం సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు. 
                                              

అనంతపురంలో కేంద్ర మంత్రి పర్యటన


అనంతపురంజిల్లా: ముఖ్యాంశాలు…
  • ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి అల్ఫోనోస్.
  • బీజేపీ జిల్లా అధ్యక్షులు, తదితరులు పాల్గొంటున్నారు…
అనంతపురంలో జిల్లా కేంద్రంలోని చిరంజీవి రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నవ యువ ఓటర్ల సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర పర్యాటన శాఖ మంత్రి ఆల్ఫోన్స్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బంగారు మల్లారెడ్డి తెలిపారు. వీరితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాల్ రెడ్డి, తదితర బీజేపీ నాయకులు పాల్గొంటారు.

చెదురుమదురు జల్లులు పడే అవకాశం ….


విశాఖపట్నం న్యూస్‌టుడే:
  • రాష్ట వ్యప్తంగా పొడి వాతావరణం  ఉంటుందని శాఖ వెల్లడించిందింది.
  • చలి ప్రభావం తగ్గుతూ ఉష్ణోగ్రతలు పెరెగే అవకాశం ఉందని తెలిసింది.
  • ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో క్యూములో నిబస్ మేఘాలు ప్రభావం వల్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తుంటాయని స్పష్టం చేసింది.
  • ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు,ప్రకాశం,శ్రీకాకుళంలో చెదురు మదురుగా జల్లులు పడే అవకాశం ఉంది.విశాఖలో ఒకటి,రెండుచోట్ల చెదురుమదురు జల్లులు పదే అవకాశం ఉంది.

H1N1 బెంగళూరు నగరంలో వ్యాపించింది…..

బెంగళూరు: మహమ్మారి వ్యాది H1N1 బెంగళూరు నగరంలో వ్యాపించిందని స్పష్టంగా వెలుగు చూడటంతో ప్రజలు, వైద్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే H1N1 39 కేసులు గుర్తించామని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఈ వ్యాదివ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తగా శుభ్రత పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు మనవి చేశారు.
H1N1 వ్యాది వచ్చిన నెలరోజుల తరువాత అది బయటపడుతుంది. ఈ వ్యాది గుట్టుచప్పుడు కాకుండా వ్యాపిస్తుందని అధికారులు అంటున్నారు. ఈ వ్యాది ఎలా వ్యాపిస్తుంది, ఆ రోగం రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ వైద్యశాఖ అధికారులు ప్రజలకు వివరించడానికి ప్రత్యేక వైద్యశిభిరాలు నిర్వహిస్తున్నారు. 2018లో బెంగళూరు నగరంలో H1N1 వ్యాది 64 మందికి వ్యాపించడంతో నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బెంగళూరు నగరంలో 6 డెంగ్యూ కేసులు, 7 చికెన్ గూన్యా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి డాక్టర్ పీకే. సునందా స్పష్టం చేశారు.

పరిశ్రమ పార్కు శంకుస్థాపన…

దొనకొండ న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు:
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
  • రూ.1.80 కోట్లతో నిర్మించనున్న 33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం…
  • మంత్రి శిద్దా రాఘవరావు శుక్రవారం శంకుస్థాపన …
మండలంలోని  రాగమక్కపల్లి గ్రామంలోని 43.79 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమల పార్కు ఏర్పాటుకు మంత్రి శిద్దా రాఘవరావు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నట్టు తహసీల్దార్‌ మునిలక్ష్మి తెలిపారు. అనంతరం వెంకటాపురంలో రూ.1.80 కోట్లతో నిర్మించనున్న 33 కేవీ విద్యుత్తు ఉప కేం‌ద్రం  నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఓటర్లును తికమక చేస్తున్నారు…

ప్రకాశం న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు:
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
  • రెండు రోజులు… వేల అర్జీలు…
  • గట్టి చర్యలతోనే అడ్డుకట్ట…
  • క్షేత్రస్థాయిలో చాలామంది చిరునామాలు దొరకని పరిస్థితి. ..
నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు రెండు రోజుల వ్యవధిలో 5,200 దరఖాస్తులు వచ్చాయి. మార్టూరు మండలం నుంచి అత్యధికంగా 1,723 అర్జీలు, ఇంకొల్లు మండలం నుంచి 1,116 వచ్చాయి.ఓటరు జాబితాలపై సైబర్‌ నేరగాళ్లు దృష్టి పెట్టారు.  చీరాల నియోజకవర్గంలోనూ ఇదే విధంగా దాదాపు 2,500 దరఖాస్తులు వచ్చాయి. ఆన్‌లైన్‌ వేదికగా సైబర్‌ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి వెనుక ఉన్నదెవరు అన్న విషయమై లోతైన దర్యాప్తు చేసి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ క్రమంలో ఎంపిక చేసిన వారి ఓట్లను తొలగించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా ఇంకొల్లులో గురువారం సర్వే చేస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

పార్క్ భూమిని కూడ వదలలేదు ……


ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ రామ్‌ ప్రవేశ్‌ ఠాకూర్‌(ఆర్పీ ఠాకూర్‌) హైదరాబాద్, ప్రశాసన్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని, దాని ఆసరాగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
హైదరాబాద్‌ ప్రశాసన్‌నగర్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం నామమాత్రపు ధరకు ప్లాట్లు కేటాయించిం దని రామకృష్ణారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఆర్‌పీ ఠాకూర్‌ కూడా ప్లాట్‌ నంబర్‌ 149లో 502 చదరపు గజా ల స్థలం పొందారన్నారు. 1996లో జీహెచ్‌ఎంసీ నుంచి జీ+1కి అనుమతి పొందారని, దానికి విరుద్ధంగా జీ+3 నిర్మించా రని పేర్కొన్నారు. అయినా, ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్య తీసుకోలేదని తెలిపారు.

అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోంది…

తూర్పుగోదావరి న్యూస్‌టుడే:
*మరీ ఇంత దిగజారుడు రాజకీయమా?..
*అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్యజమెత్తిన వైఎస్సార్ సీపీ శ్రేణులు..
ఓట్లను తొలగించడానికి తప్పుడు ఫారం-7లను  ఆన్‌లైన్ లో సమర్పించి,అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్ సీపీ నేతలు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.కొందరు మీ సేవ నిర్వహకులకులతో ఈ పని చేయిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.తహసీల్దార్  కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు.తప్పుడు ఫారాలు దాఖలు చేస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని అదికారులకు వినతి పత్రాలు అందజేశారు.
                                                                        

బిక్కుబిక్కుమంటున్న మర్రిచెట్లపాలెం వాసులు

ప్రకాశం న్యూస్‌టుడే :ముఖ్యాంశాలు :
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడి్‌షన్
  • ప్రభుత్వ భూముల్లో గత నాలుగు రోజులుగా ..
  • ముసీనది గర్భంలోకి పైపులు వేసి….
  • కొండ పోరంబోకు భూముల్లో పరిశ్రమల వ్యర్థాలు…
చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం సమీపంలో యర్రకొండ దిగువ భాగంలో వ్యవసాయ భూములకు పక్కనే ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తెచ్చి పోస్తుండటంతో రైతులతో పాటు స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. చీమకుర్తి, మర్రిచెట్లపాలెం ప్రాంతాల్లో విస్తరించిన వందలాది గ్రానైట్‌ పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపిస్తే అక్కడ పోసేస్తున్నారు. రహదారుల అంచులు, వాగులు, వంకలు, సాగర్‌ కాలువ కట్టల అంచుల్లో పెద్ద ఎత్తున వీటిని కుమ్మరిస్తున్నా.. చీమకుర్తి పొదిలి మండలాలకు సరిహద్దున ప్రవహిస్తున్న ముసీనది గర్భంలోకి పైపులు వేసి మరీ ఈ వ్యర్థాలను వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని మర్రిచెట్లపాలెం తూర్పు వైపున ఉన్న యర్రకొండ (ఎద్దులకొండ) దిగువ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో గత నాలుగు రోజులుగా ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తెచ్చి పోస్తున్నారు. ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో గ్రానైట్‌ పరిశ్రమల వ్యర్థాలు పోసేందుకు అనుమతులు ఎవరిచ్చారని వారు నిలదీస్తున్నారు.అధికారులు తగిన చర్యలు చేపట్టి కొండ పోరంబోకు భూముల్లో పరిశ్రమల వ్యర్థాలు పోయకుండా చూడాలని వారు కోరుతున్నారు.
                                                                    

నెలల తరబడి తిరుగుతున్న పట్టించుకోవడం లేదు….


విశాఖపట్నం న్యూస్‌టుడే :
*8 నెలల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులు…
* కరెంట్ తీగలు ఉండడం వల్ల రైతులు అటువైపు వెళ్లాంటంటేనే భయపడుతున్నారు….
విశాఖ పట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో రైతుల పొలాల్లో కరెంటు తీగలు చేతికి అందేలా వున్నాయని సదరు అధికారులకు ఫిర్యాదు చేసి 8 నెలలు నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. పొలాల్లోకెళ్లే రైతులు అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
                                                  

ప్రముఖుల విషయంలో కేర్ …

ఒంగోలు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు:
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
  • 13 జిల్లాలకు చెందిన 87 మంది రిజర్వు,  ఎస్‌.ఐ.లు,…
  • కానిస్టేబుళ్లకు 12 రోజుల శిక్షణ కార్యక్రమం….
  • శిక్షణకు హాజరైన వారంతా 30 నుంచి 35 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం..
  • గుంటూరు రేంజి ఐజీ ఆర్‌.కె.మీనా హెచ్చరించారు…..
దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖుల భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యహరించినా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని గుంటూరు రేంజి ఐజీ ఆర్‌.కె.మీనా హెచ్చరించారు. ఒంగోలు పోలీసు శిక్షణ కళాశాల(పీటీసీ)లో సెక్యూరిటీ విభాగంలో ఉన్న 13 జిల్లాలకు చెందిన 87 మంది రిజర్వు,  ఎస్‌.ఐ.లు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు 12 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమమైంది. ఐజీ మీనా ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణకు హాజరైన వారంతా 30 నుంచి 35 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. అనుమానిత వ్యక్తుల కదలికలపై ఓ కన్నేసి ఉండాలని సూచించారు. 12 రోజుల పాటు జరిగే శిక్షణలో ప్రముఖుల భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తారని, పీటీసీ ఇన్‌ఛార్జి ప్రధానాచార్యులు పి.బిజోయ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌,  సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీ టి.రామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సాంప్రదాయం ఓ పండుగా…….

చిత్తూరు న్యూస్‌టుడే:
  *ఆ గ్రామాలలో చేప్పుకోదగ్గ పండుగా.
  *సంక్రాంతికి బదులు శివరాత్రి.
చిత్తూరులో కొన్ని గ్రామాలు సంక్రాంతి పండుగకు  నోచుకోవు.ఏటా శివరాత్రికి వారం ముందు ప్రజలు ఆవుల పబ్బం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ.జిల్లాలోని చౌడేపల్లి మండలం పరిగిదొనలో నిర్వహించే ఆవుల పబ్బం రాష్ట్రంలోనే చెప్పుకోతగ్గది.పరిగిదొన,గడ్డంవారిపల్లి,ఆమినిగుంట పంచాయతీలకు చెందిన 12 గ్రామాల ప్రజలు సంక్రాంతిని తలపించేలా ఈ పండుగను నిర్వహిస్తారు.
                            

కుటుంబం అంతా దేశం కోసమే …

న్యూస్‌టుడే : ముఖ్యాంశాలు :
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడి్‌షన్ ..
  • 16 ఏళ్లు సేవలు అందించారు…..
  • అభినందన్‌ వయసు 36ఏళ్లు. సొంత రాష్ట్రం తమిళనాడు. …
  • విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. …
  • సూర్యకిరణ్‌ విన్యాసాలు చేయడంలో ఈయన దిట్ట…
  • 1999 కార్గిల్‌ యుద్ధంలో సమయంలో కీలక పాత్ర …
  •  అభినందన్‌ సోదరుడు కూడా వాయుసేనలో …
  • అభినందన్‌ భార్య తన్వి మార్వా కూడా ఐఏఎఫ్‌లో అధికారిగా ….
విక్రమ్‌ అభినందన్‌ మహారాష్ట్రలో ఖడక్‌వాస్లాలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో 16 ఏళ్లు సేవలు అందించారు. మన దేశంలోని అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లలో ఆయన కూడా ఒకరు. అభినందన్‌ వయసు 36ఏళ్లు. సొంత రాష్ట్రం తమిళనాడు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వారు. విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. సుఖోయ్‌–30 యుద్ధ విమానాలను అత్యంత చాకచక్యంగా నడపగలరు. ఆ తర్వాత మిగ్‌–21 విమానం నడిపే బాధ్యతలు ఆయనకి అప్పగించారు. సూర్యకిరణ్‌ విన్యాసాలు చేయడంలో ఈయన దిట్ట.అభినందన్‌ తండ్రి కూడా మాజీ ఎయిర్‌మార్షల్‌. ఆయన పేరు సింహకుట్టి వర్ధమాన్‌. గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌లో చీఫ్‌ ఆపరేషన్‌ ఆఫీసర్‌గా సేవలందించారు. 1999 కార్గిల్‌ యుద్ధంలో సమయంలో కీలక పాత్ర పోషించారు. అభినందన్‌ సోదరుడు కూడా వాయుసేనలో పనిచేశారు. అభినందన్‌ భార్య తన్వి మార్వా కూడా ఐఏఎఫ్‌లో అధికారిగా పని చేసి రిటైర్‌ అయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు.ఇలా కుటుంబం మొత్తం దేశ సేవకే తమ జీవితాలను అంకితం చేయడం విశేషం. అభినందన్‌ను విడుదల చేయడానికి పాక్‌ అంగీకరించడంతో ఆయన తండ్రి వర్ధమాన్‌ ఆనందానికి హద్దుల్లేవు. నిజమైన సైనికుడంటూ కుమారుడిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. దేశం అంతా తన కుమారుడి విడుదలకు ప్రార్థించిన భారతీయులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తుది దశకు చేరుకున్న పార్కు నిర్మాణం….

విశాఖపట్నం న్యూస్‌టుడే :
  •  రూ. 8 లక్షల వ్యయంతో పార్కు నిర్మాణం….
  •  చివరి దశకు పార్కు నిర్మాణం చేరిందని (APPశ్రీనవాస్…., PHCచైర్మన్ కాశపు అప్ఫారావు  ) అన్నారు….
స్థానికPHC ఆవరణలో నిర్మిస్తున్న పార్కు తుదిదశకు చేరుకున్నట్లుAPO శ్రీనివాస్ ,PHC చైర్మన్ కాశపు అప్ఫారావు తెలిపారు. గతేడాది నవంబర్‌లో కలెక్టర్ సందర్మనాతరం రూ.8 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. 

అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోంది…


తూర్పుగోదావరి న్యూస్‌టుడే:
*మరీ ఇంత దిగజారుడు రాజకీయమా?..
*అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్యజమెత్తిన వైఎస్సార్ సీపీ శ్రేణులు..
ఓట్లను తొలగించడానికి తప్పుడు ఫారం-7లను  ఆన్‌లైన్ లో సమర్పించి,అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్ సీపీ నేతలు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.కొందరు మీ సేవ నిర్వహకులకులతో ఈ పని చేయిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.తహసీల్దార్  కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు.తప్పుడు ఫారాలు దాఖలు చేస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని అదికారులకు వినతి పత్రాలు అందజేశారు.

ఇప్పటికే పార్టీకి పలువురు దూరం…

తూర్పుగోదావరి న్యూస్‌టుడే:
*ఆనందరావుకు టిక్కెట్ ఇవ్వవద్దని యనమలకు ఫిర్యాదు.
*పదవులు వచ్చినవారు,రానివారు..,అందరిదీ ఒకటే తీరు..
కోనసీమ కేంద్రం అమలాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి.కీలక నాయకులు,ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.అధికారంలోకి వచ్చిన తరువాత పదవులు రాలేదని కొంతమంది కినుక వహిస్తే..పదవులు పొందినవారు సహితం అసంతృప్తితో ఉండడం విశేషం.అదికారంలో ఉండడంతో నిన్నటివరకూ గుంభనంగా  ఉన్న నేతలు ..ఎన్నికల వేళ ఒక్కసారిగా తమ అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నారు.

పశువుల దాడిపై లేగ దూడ మృతి….

ప్రకాశం అర్థవీడు, న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడి్‌షన్
2. అటవీ ప్రాంతంలో నీటి కుంట వద్ద దొడ్లు,…
3.పశువులను మేపుకొని జీవనం సాగించే ..
పశువులను అటవీ ప్రాంతాల్లో మేపుకొంటూ తాగునీరున్న చోట గుడిసెలు ఏర్పాటు చేసుకోగా- వాటిని అటవీశాఖ సిబ్బంది నిప్పు పెట్టిన సంఘటన గురువారం అర్థవీడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు… అచ్చంపేట, బొల్లుపల్లి, పాపినేనిపల్లి గ్రామాలకు చెందిన పశువుల కాపర్లు ఇందిరానగర్‌ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో నీటి కుంట వద్ద దొడ్లు, గుడిసెలు వేసుకున్నారు. పగలంతా పశువులను మేపుకొని… రాత్రి అక్కడే నివసించేవారు.పశువులను మేపుకొని జీవనం సాగించే తమను అధికారులు అటవీ ప్రాంతంలోకి వెళ్లనీయడం లేదని బాధితులు తత్తూరి దేవమ్మ, ఏశమాల దేవయ్య, కొమిరే రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై గిద్దలూరు అటవీశాఖ డీఎఫ్‌వో సతీష్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా… పశువుల దొడ్లు కాలిపోయిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
                                                         

నేటి మంచిమాట


కొంతమంది మనసు లోకత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మసుషులు ఉంటారు. జాగ్రత్త.

రియల్టర్ కార్యాలయంలో ఐటీ సోదాలు…

హైదరాబాద్ న్యూస్‌టుడే:
  • ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో సంధ్యా కన్వెన్షన్ రియలర్ట్‌కు సంబందించిన కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ రియలర్ట్ కు సంబంధించిన కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తొంది.
  • గచ్చిబౌలి, రాయదుర్గంలోని సంధ్యా కార్యాలయాల్లో నిన్నటి నుండి ఈ తనిఖీలు సాగుతున్నాయి.
  • యజమాని శ్రీధర్ నివాసాల్లోనూ ఐటీ సోదాలు చేస్తుంది.

ఫైలెట్ కు జెనీవా అండ …

న్యూస్‌టుడే:
  • భారత్ పైలెట్ కు జెనీవా అండ.
ప్రస్తుతం దేశం ఆలోచనా అంతా పాకిస్థాన్ అదుపులో ఉన్న వింగ్ కమాండర్ గురించే.అతన్ని సురక్షితంగా రప్పించుకునేదేలా?అన్నదే అందరి మదినీ తొలిచివేస్తుంది. యుద్ధఖైదీ అయిన కమాండర్ కు రెండో ప్రపంచ యుద్ధానంతరం 1949 లో జరిగిన జెనీవా ఒప్పందాలే రక్ష.దాదాపు 196 దేశాలు దీనిపై సంతకాలు చేయగా ఈ ఒప్పందాలను మూడుసార్లు సవరించారు.

రెండోసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ…….

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల కోసం సమాయాత్తమౌత్తమౌతోంది భారతీయ జనతా పార్టీ. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు, వనరులనూ వినియోగించుకుంటోంది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలుపుతోంది. మరి కొన్ని చోట్ల.. ఇదివరకే ఉన్న పొత్తులను ఈ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తోంది. దీనికోసం నామమాత్రపు సీట్లను తీసుకోవడానికి కూడా వెనుకాడట్లేదు. తాజాగా పంజాబ్ లో శిరోమణి అకాళీదళ్ పార్టీతో పొత్తు ఖరారు చేసుకుంది బీజేపీ. మొత్తం 13 లోక్ సభ స్థానాలు ఉన్న పంజాబ్ లో శిరోమణి అకాళీదళ్ 10 చోట్ల పోటీ చేస్తుంది. మిగిలిన మూడింటిని మిత్రపక్షం బీజేపీకి కేటాయించింది. అకాళీదళ్ తో పొత్తు ఖాయమైనట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం వెల్లడించారు. ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

బీరు ప్రియుల‌కు ఇబ్బందే..! గొంతు త‌డుపుకోవ‌డం క‌ష్ట‌మే..!

హైదరాబాద్ : ఇది ఖ‌చ్చితంగా బీరు ప్రియుల‌కు చేదు వార్తే..! వేస‌వి తాపం పెరుగుతోంది. సాయంత్రానికి జిహ్వ చాప‌ల్యం ఉన్న మందు బాబులు కాస్త బీరుతో గొంతు త‌డుపుకోవ‌చ్చనుకుంటే అది ఇక కుద‌ర‌ని ప‌ని. బీరు తాగకండి. కావాలంటే మద్యం తాగండి అంటూ హుకుం జారీ చేస్తోంది రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ. ఇది వినడానికి వింతగానే ఉన్నా అదే పోకడను ప్రదర్శిస్తోంది. నిజానికి దేశంలోనే బీరు ఎక్కువ వినియోగంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇక్కడి మందుబాబులు బీరే ఎక్కువ ఇష్టపడతారు. ఎండాకాలంలో బీరు విక్రయాలు మ‌రింత జోరుగా ఉంటాయి. కానీ ఎక్సైజ్‌ శాఖ కేవ‌లం అద‌న‌పు ఆదాయం కోసం క‌క్కుర్తి ప‌డుతూ బీరు విక్రయాలను త‌గ్గిస్తూ మద్యం అమ్మకాలను పెంచాలని యోచిస్తోంది.
కానీ ఆరోజు 25 శాతం బీరు, 75శాతం మద్యం సరఫరా చేస్తామని చెబుతుండడంతో తమకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. బుధవారం మొత్తానికే బీరు సరఫరా చేయలేదని, గురువారం 25శాతం బీరుతో ఎలా సరిపెట్టుకుంటామని అంటున్నారు. ఒకపక్క వేసవి తాపంతో బీరు విక్రయాలు పెరిగాయని, ఇలాంటి సందర్భంలో విక్రయాలు పెంచుకోవాలని ఆలోచించాలి గానీ తగ్గించుకోవాలంటూ ఆదేశించడం ఇదెక్కడి వింత ధోరణి అంటూ యజమానులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Wednesday, February 27, 2019

న్యూస్‌టుడే:


కడప జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ రెండో రోజు పర్యటించనున్నారు.


పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు.


అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జనసేన కేడర్‌తో పవన్‌ భేటీ కానున్నారు.


సాయంత్రం 4 గంటలకు రైల్వేకోడూరులో పవన్‌ రోడ్‌ షో నిర్వహించనున్నారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు


అండన్‌మాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

న్యూస్‌టుడే:


అండన్‌మాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించండంతో రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.8గా నమోదైంది.


భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.


కియోల్ లో స్థానికులకు ఉద్యోగాలు ….

అనంతపురం న్యూస్‌టుడే:
  • కియోకార్ల కంపెనీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్.
  • కార్యదర్శి ఇంతియాజ్ జెండా ఊపి ప్రారంభించారు.
కియోకార్ల పరిశ్రమ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు,స్థానిక నిరుద్యోగులకు ఆ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపియం, సి ఐ ఐ, జనసేన ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండలో మంగళవారం పాద యాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను సిపిఎం దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిశ్రమ కోసం 376 రైతు కుటుంబాలకు చెందిన 599 ఎకరాల భూమిని తీసుకుంటూ 30 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారనే కానీ ఒక్కరికి స్థానికులకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు.

స్నేహితుడి ప్రాణాల కోసం …

సూర్యపేట న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
  • కోదాడలో విషాదం చోటుచేసుకుంది.
  • పెద్ద చెరువులో పడి నలుగురు విధ్యార్ధులు మృతిచెందారు.
కోదాడలో విషాదం చోటుచేసుకుంది. పెద్ద చెరువులో పడి నలుగురు విద్యార్ధులు మృతిచెందారు. సమీర్ అనే విద్యార్ధి  చెరువులో చేతులు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు నీటీలో జారిపడ్డారు. అతనని కాపాడడానికి వెళ్ళిన ముగ్గురు విద్యార్ధులు కూడా నీటిలో మునిగిపోయారు. కోదాడలోని కళాశాలకు చెందిన విద్యార్ధులు సమీర్,ప్రవిణ్, భవాని ప్రసాద్, మహేందర్‌గా గుర్తించగా మృతదేహల కోసం గాలింపు చేపట్టారు.

రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి పొందాలి…

శ్రీకాకుళం న్యూస్‌టుడే:ముఖ్యంశాలు:
  • ప్రకటనల జారీకి  ముందస్తు  అనుమతి   పొందాలని  జిల్లా   కలెక్టర్   మరియు  జిల్లా  ఎన్నికల  అధికారి జె. నివాస్ స్పష్టం  
  • మీడియా  సర్టిఫికేషన్    మరియు  మోనిటరింగు   కమిటీ (ఎం.సిఎం.సి)   సిక్షణా.   
  • ఎన్నికలలో  పోటీచేస్తున్న  అభ్యర్ధులు ప్రింటు,  ఎలక్ట్రానిక్  మీడియాలలో   ప్రకటనల జారీకి  ముందస్తు  అనుమతి   పొందాలని  జిల్లా   కలెక్టర్   మరియు  జిల్లా  ఎన్నికల  అధికారి జె. నివాస్ స్పష్టం  చేసారు. 
మీడియా  సర్టిఫికేషన్    మరియు  మోనిటరింగు   కమిటీ (ఎం.సిఎం.సి)   సిక్షణా  కార్యక్రమం  కలెక్టర్  కార్యాలయంలో  బుధ  వారం  జరిగింది.1951 లోని  పార్ట్-7,అధ్యాయం-3ను సవరించుటకు  ఎన్నికల  సంఘం  ప్రతిపాదించిందని  అన్నారు.      రాజకీయ  పార్టీలు/ సంస్ధలు/వ్యక్తి  లేదా సంభంధిత  ప్రయత్నం   చేసే  ఎవరైనా  సరే రాజకీయ  ప్రకటనలను  పత్రికలు, ఇ-పేపర్లు,   ఎలక్ట్రానిక్  మీడియా, కేబుల్  నెట్ వర్కు ,  ఫేస్ బుక్, ట్విటర్,వికీపిడియ సినిమా హాల్స్,రేడియో,  బహిరంగ  ప్రదేశాలలో  ఆడియో  విజువల్  ప్రదర్శనలు  తదితర  అన్ని రకాల  మీడియాలలో  ప్రకటనలకు  ఎం.సి.ఎం.సి  అనుమతి  తప్పనిసరి  అని  కలెక్టర్   అన్నారు. 
                                                     

జేసీ చక్రధర్ బాబుకు బంగారు పతకం…


శ్రీకాకులం:న్యూస్‌టుడే:ముఖ్యంశాలు………
  • శ్రీకాకుళం  జిల్లా  జాయింట్  కలెక్టర్  కేవీఎన్   చక్రధరబాబుకు  బంగారు  పతకం  
  • పతకాన్ని  కేంద్ర   మంత్రి డాక్టర్  జితేంద్రసింగ్  చేతుల  మీదగా  
  • శ్రీకాకుళం  జిల్లా  జాయింట్  కలెక్టర్  కేవీఎన్   చక్రధరబాబుకు  బంగారు  పతకం   లభించింది. 
ఈ-గవర్నెన్స్  పునవర్వసు2019 పురస్కారంగా  ఆయన  బంగారు  పతకాన్ని  కేంద్ర   మంత్రి డాక్టర్  జితేంద్రసింగ్  చేతుల  మీదగా  అందుకున్నారు.  కొవ్వాడ  అణువిధ్యుత్  ప్రాజెక్టుకు  సంబంధించిన  చేపట్టిన  భూసేకరణ,   పునరావాస  కార్యక్రమాలు,  వారికి  నష్టపరిహారం  సకాలంలో  అందించడం  వంటి   అంశాలకు  సంబంధించి చక్రధరబాబు ఈ పురస్కారం అందుకున్నారు.