Friday, March 22, 2019

నేడు ఇన్విజిలేటర్ల మార్పు….


కర్నూలు న్యూస్‌టుడే:
*వార్షిక పరీక్షల్లో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ విధుల్లో పాల్గొనే ఇన్విజిలేటర్ల మార్పు…
*ప్రతి మూడు రోజులకోసారి చొప్పున జంబ్లింగ్‌ విధానం అమలు…పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
వార్షిక పరీక్షల్లో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ విధుల్లో పాల్గొనే ఇన్విజిలేటర్లకు ప్రతి మూడు రోజులకోసారి చొప్పున జంబ్లింగ్‌ విధానం అమలు చేయాలని సూచించింది. శనివారం జరిగే ఆంగ్లం పేపర్‌-2 పరీక్షకు జిల్లా విద్యాశాఖధికారులు నూతనంగా ఎంపిక చేసిన ఇన్విజిటేటర్లు విధుల్లోకి హాజరుకానున్నారు. ఈనెల 18 నుంచి ప్రారంభమైన పది పరీక్షల్లో మొదటిరోజు పాల్గొన్న సిబ్బందికి 20వ తేదీతో మూడు రోజులు ముగిసింది. పరీక్ష కేంద్రం మార్పులు పొందిన ఇన్విజిలేటర్ల చరవాణికి డీఈవో కార్యాలయ అధికారులు సమాచారం పంపారు. ఆంధ్ర ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న సందర్భంగా శుక్రవారం జరగాల్సిన ‘పది’ పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. 21వ తేదీ జరగాల్సిన పరీక్ష ఏప్రిల్‌ 3న జరగనుంది.
              

No comments:

Post a Comment