Friday, March 22, 2019

నైపుణ్యంతోనే ఉజ్వల భవిష్యత్తు..

శ్రీకాకుళం,న్యూస్‌టుడే,: 
1)విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు…….. 
2) ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు విస్తరణ……….
విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గార మండలం అంపోలులోని శారదా ఇంజినీరింగు కళాశాల కార్యదర్శి బౌరోతు శ్రీనివాసరావు పేర్కొన్నారు.కళాశాలలో రెండు రోజులుపాటు నిర్వహించనున్న ఇంజినీరింగ్‌ ఫెస్టు శారదోత్సవ్‌- 2కె19,వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని..అయితే  అందుకు తగ్గ నైపుణ్యాలు తప్పనిసరిగా పెంపొందించుకోవాలని సూచించారు.ప్రిన్సిపల్‌ డా. ఆర్‌.గోవిందరావు మాట్లాడుతూ కళాశాల స్థాయిలో సబ్జెక్టుపై పట్టు,పటిమ,ప్రవర్తన,వ్యక్తిగత క్రమశిక్షణ వంటివి పెంపొందించుకోవాలన్నారు. ఆటోమేషన్‌ రంగంలో అన్ని శాఖల విద్యార్థులకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

No comments:

Post a Comment