కడప న్యూస్‌టుడే:
*ఎర్ర గంగిరెడ్డి అనే వారు సూత్రధారులైతే.
వైఎస్.వివేకానందరేడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకరెడ్డితో పాటు..నాగప్ప,కుమారుడు శివను సిట్ బృందం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది.ఇదిలా ఉంటే వివేకానందరెడ్డి హత్యకు ఆస్తి తగాదాలే కారణమా? అనుచరులే ఆయన్ని చంపేశారా? పోలీసులు ఈ అంశాలనే దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. పరమేశ్వర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అనే వారు సూత్రధారులైతే.. పాత్రధారిగా చంద్రశేఖర్‌రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇప్పటి వరకు 40 మందిని రహస్య ప్రదేశాల్లో విచారిస్తున్నారు. కేసు కొలిక్కి వస్తుండటంతో ఒకటి రెండురోజుల్లోనే అధికారికంగా అరెస్ట్‌లు చూపించే అవకాశం ఉన్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. హత్య జరిగిన రాత్రి 11.30గంటల ప్రాంతంలో చిన్న అనే వ్యక్తికి చెందిన స్కార్పియో వాహనంలో చంద్రశేఖర్‌రెడ్డి పులివెందులలో తిరిగినట్లు సీసీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

No comments:
Post a Comment