కొత్తగూడెం న్యూస్‌టుడే:
*ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిస్థితులపై ఆరా తీసిన చంద్రబాబు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ గురువారం ఉండవల్లిలో కలిశారు. చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో కోనేరు వెంటనే వెళ్లి కలిసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయంపై చర్చించినట్లు తెలిసింది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిస్థితులపై ఆరా తీసిన చంద్రబాబు.. నామా నాగేశ్వరరావు పార్టీని వీడినా నష్టమేమీ లేదని అన్నట్లు సమాచారం. కార్యకర్తలే టీడీపీ బలమని, నాయకులను తయారు చేసుకునే శక్తి పార్టీకి ఉందని చెప్పినట్లు తెలిసింది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి టీడీపీ పోటీ చేసే వషయమై ముఖ్య నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు చిన్ని వివరించారు.
..TDP..01.jpg)
No comments:
Post a Comment