Friday, March 22, 2019

ఓట్ల గల్లంతుతో లబోదిబోమంటున్న పట్టభద్రులు..


గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే:
* ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేక లబోదిబో…
*ఎన్నికల అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు…
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికలకు వివాదాల సడి రేగింది. అర్హత కలిగిన పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఓటర్లుగ చేర్చకపోవటం జిల్లాలో విమర్శలకు తావిస్తోంది. కిందటి దఫా జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన పట్టభద్రులు ఈ ఎన్నికలలో మళ్లీ కొత్తగా ఓటు కోసం నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఓటు ఉన్నప్పటికి ఈ సారి దరఖాస్తు చేసుకున్నా ఓటరుగా చేర్చకపోవటం విమర్శలకు తావిస్తోంది. సాధారణ ఎన్నికల హడావిడిలో పడిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. ఎంతోమంది పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేక లబోదిబోమంటున్నారు. గజిటెడ్ అధికారిచేత అటెస్ట్ చేయించి, తమ విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలను సమర్పించినా ఓటు హక్కు కల్పించకపోవటం ఎన్నికల అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

No comments:

Post a Comment