Friday, March 22, 2019

అపోహకులకు తెర్లాం పూర్ణం స్పష్టం…..


చిత్తూరు న్యూస్‌టుడే: 
*జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం.
*బీ ఫారం ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధం
తననెవరూ బెరించలేదని తనకు గుండెపోటూ రాలేదని పూతలపట్టు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మొదట ఎంపికైన తెర్లాం పూర్ణం స్పష్టం చేశారు.గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు షుగర్ లెవల్స్ పెరగడంతో చికిత్స చేయించుకునేందుకు చిత్తూరు నగర సమీపంలోని అపోలో ఆసుపత్రికి వెళ్లినట్లు స్పష్టం చేశారు.అంతలోనే తనపై వదంతులు సృష్టించారని చెప్పారు. తాను ఎవరికి భయపడేది లేదని స్పష్టం చేశారు. తనకు బీ ఫారం ఇస్తే పూతలపట్టు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గతంలో వైకాపాలో ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడినై తెదేపాలో చేరినట్లు తెలిపారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు.

No comments:

Post a Comment