Friday, March 22, 2019

వజ్రాయుధం…కొందరే ప్రయోగం ….


గుంటూరు న్యూస్‌టుడే: రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గానికి శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో వెనుకబడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో సగటున 70 శాతానికిపైగా పోలింగ్‌   జరుగుతుండగా ఈ ఎన్నికల్లో అది 45.95 శాతానికి పరిమితం కావడం గమనార్హం. ఇదే నియోజకవర్గంలో గతేడాది ఇది 44 శాతం ఉండగా నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు చట్టసభల్లో ప్రస్తావించే నేతలను ఎన్నుకునేందుకూ పట్టభద్రులు దూరంగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో 1,41,970 మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా 66,602 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 46.91 శాతం పోలింగ్‌ నమోదైంది. కృష్ణా జిల్లాలో 1,06,829 మంది ఓటర్లుండగా 47,723 మంది ఓటింగ్‌లో పాల్గొనడంతో అది 44.67 శాతంగా ఉంది. రెండు జిల్లాల్లో కలిపితే 45.95 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.        

No comments:

Post a Comment