Friday, March 22, 2019

నరేష్ ప్రమాణ స్వీకారం…


మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేశ్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సూపర్ స్టార్ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు దంపతులు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హాజరయ్యారు. వీరితో పాటు ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం గమనార్హం. మా ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ‘మా’ కోసం కంపోజ్ చేయించిన ప్రత్యేక గీతాన్ని సూపర్ స్టార్ కృష్ణ దంపతులు విడుదల చేశారు.

No comments:

Post a Comment