Friday, March 22, 2019

అదుపు తప్పి వాహనం బోల్తా………..


కర్నూలు న్యూస్‌టుడే:
  • *15 మందికిపైగా గాయాలు..
  • వాహనం బోల్తాపడిన ఘటనలో 15మందికిపైగా గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. గురువారం హాలహర్వి మండలం బిలేహల్‌కు చెందిన సుమారు 50 మందికి పైగా కూలీలు ఒకే వాహనంలో చిప్పగిరి మండలం డేగులపాడులో మిరపకోత పనులకు వెళ్తున్నారు. చింతకుంట – ఎంకేపల్లి గ్రామాల మధ్యలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా కూలీలకు గాయపడ్డారు. చింతకుంట, ఎంకేపల్లి గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఒక మహిళను ద్విచక్ర వాహనంపై ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం 108కు సమాచారం అందించారు.. వాహనం రావడానికి ఆలస్యమవుతుందని భావించిన స్థానికులు మరో ఆటోలో క్షతగాత్రులను వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో 108 వాహనం రావడంతో అందులో తీసుకెళ్లారు. పోలీసులు సైతం మరికొందరిని ప్రత్యేక వాహనంలో వైద్యశాలకు తరలించారు. పరిమితికి మించి తరలించడమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హనుమంత రెడ్డి తెలిపారు.
                                                                              

No comments:

Post a Comment