కావల్సినవి:
బ్రెడ్‌స్లైసులు – ఎనిమిది, నూనె – వేయించేందుకు సరిపడా, కొబ్బరితురుము – మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు – తగినంత, అల్లం, పచ్చిమిర్చి తరుగు – రెండు చెంచాలు, బాదం పలుకులు – రెండు చెంచాలు, పెరుగు – ఒకటిన్నర కప్పు, తీపి చట్నీ – పావుకప్పు, కారం – అరచెంచా, కొత్తిమీర తరుగు – పావుకప్పు. తీపి చట్నీ కోసం: ఖర్జూరాలు – పన్నెండు, చింతపండు గుజ్జు – పెద్ద చెంచా, బెల్లం – చిన్న ముక్క, కారం – ముప్పావుచెంచా, చాట్‌మసాలా – అరచెంచా, జీలకర్రపొడి – చెంచా, ఉప్పు – తగినంత. తయారీ: ముందుగా తీపి చట్నీ తయారు చేసుకోవాలి. ఖర్జూరాల్లో గింజలు తీసేసి ముక్కల్లా కోయాలి. ఈ ముక్కలకు చింతపండు గుజ్జు కలిపి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ గుజ్జులో మిగిలిన పదార్థాలన్నీ వేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. దీన్ని మళ్లీ పొయ్యిమీద పెట్టి.. దగ్గరకు అయ్యాక దింపేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో కొబ్బరి తురుమూ, కొద్దిగా ఉప్పూ, పచ్చిమిర్చీ, అల్లం తరుగూ, బాదం పలుకులు తీసుకుని అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసుల్ని గుండ్రంగా కత్తిరించుకోవాలి. ఒకదానిలో ఒకటిన్నర చెంచా కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి.. అర్థచంద్రాకారంలో వచ్చేలా తడి చేత్తో అంచుల్ని మూసేయాలి. ఇలానే మిగిలినవీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని కాగుతోన్న నూనెలో వేసి వేయించి తీసుకోవాలి. వీటిని ఓ వెడల్పాటి పళ్లెంలో సర్దుకోవాలి. ఓ గిన్నెలో పెరుగూ, కారం, కొద్దిగా ఉప్పు కలిపి బాగా గిలకొట్టాలి. దీన్ని బ్రెడ్‌స్లైసులపై వేసి.. పైన తీపి చట్నీ కొద్దికొద్దిగా వేయాలి. చివరగా కొత్తిమీర అలంకరిస్తే సరిపోతుంది.

No comments:
Post a Comment