Friday, March 22, 2019

నీటి విడుదల…..


గుంటూరు  న్యూస్‌టుడే:
*కుడి కాలువకు  తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల…
*గంటకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున పెంచుతూ సాయంత్రం 5 గంటలకు 3వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు…
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి కాలువకు శుక్రవారం తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేశారు. ఇటీవల కృష్ణానది యాజమాన్య బోర్డు కుడి కాల్వకు 8 టీఎంసీల నీటిని కేటాయించింది. దీనిలో భాగంగా ప్రస్తుతం తాగునీటి అవసరాల నిమిత్తం ప్రభుత్వం 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 1.30గంటలకు 4వ గేటు ద్వారా 500క్యూసెక్కుల నీటిని డ్యామ్‌ అధికారులు విడుదల చేశారు.  గంటకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున పెంచుతూ సాయంత్రం 5 గంటలకు 3వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదల ఆరు రోజుల పాటు కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్‌ జలాశయం నీటిమట్టం 520.80 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 150.73 టీఎంసీలకు సమానంగా ఉంది. 

No comments:

Post a Comment