Friday, March 22, 2019

దేశానికి ఎంతో అవసరం కానున్న సివిల్ ఇంజనిర్ల సేవలు

న్యూస్‌టుడే:
* తక్కువ వ్యయంతో నాణ్యమైన కట్టడాలపై దృష్టి సారించాలి…
*ప్రతి విద్యార్ధి ఒకలక్ష్యంతో ముందుక్లు సాగాలని సూచన… 
సివిల్ ఇంజినీర్ల సేవలు ఈ దేశానికి ఎంతో అవసరమని శ్రీలంకకు చెందిన ఆచార్య డాక్టర్ రంజిత్‌దిశనాయక్ అన్నారు. కేఎల్  డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజినీరింగ్‌లో పురోగతి అంశంపై జరిగిన రెండో అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించారు. సదస్సులో సావనీర్ ఆవిష్కరించారు. నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకోవల్సిన అవసరం  ఉందన్నారు. తక్కువ వ్యయంతో నాణ్యమైన కట్టడాలపై దృష్టి సారించాలని సూచించారు. కేఎల్ఈఎఫ్ ఉపాధ్యక్షులు కోనేరు  రాజాహరిన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి ఒకలక్ష్యంతో ముందుక్లు సాగాలని సూచించారు. ఉపకులపతి డాక్టర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి,   ప్రొవైస్ ఛాన్స్‌లర్ రామ్‌కుమార్ , రిజిస్ట్రార్ లక్ష్మీకాంతం, ఆచార్యులు నారాయణ, సుబ్బారావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment