కడప న్యూస్‌టుడే:
నేడు వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు.జగన్ నామినేషన్ కోసం పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.ప్రాజెక్టులన్ని నత్త నడక సాగుతున్నాయని అన్నారు.సున్నా వడ్డీ పథకం గాలికొదిలేశారని,పసుపు కుంకుమ పేరుతో డ్రామాలు చేస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను కడప గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉందని,పులివెందుల గడ్డపై పుట్టడం మరింత గర్వంగా ఉందని అన్నారు.కష్టంలో కూడా గుండె ధైర్యంతో ఎలా ఉండాలో ఈ ప్రాంతం నేర్పిందని,రాతి నేలలో సేద్యం ఎలా చెయ్యాలో ఈ ప్రాంతం నేర్పించిందని జగన్ అన్నారు.పదిమందికి మంచి చెయ్యడమే తెలుసని,మనం మంచి చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యమని,చీకట్లో నుంచి నిజం బయటకు రాక తప్పదని వైసీపీ అధినేత అన్నారు.

No comments:
Post a Comment