కర్నూలు న్యూస్‌టుడే:
*సుస్థి ర స్థానం అన్నా.. నిలబడని నేతలు..
నిన్నటి వరకు చంద్రబాబుతోనే అభివృద్ధి అన్నారు. భారీగా నిధులు కేటాయించారన్నారు. సర్వేల్లో సీటు రాకపోవడంతో కండువాతోపాటు మాట మార్చేశారు. అధికార పార్టీలో అసంతృప్తులకు భవిష్యత్తు గురించి హామీలిచ్చినా ఆగని వైనమిది. బలమైన అభ్యర్థిని నిలబెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని, ఆయా నియోజకవర్గాల్లో గెలుపునకు హుందాగా కృషి చేస్తే సుస్థిర స్థానం కల్పిస్తానంటూ సీఎం చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభలో భరోసా ఇచ్చినా దూకుళ్లు ఆగలేదు. సీటు రాకపోవడంతో మొదటే బుట్టా రేణుక పార్టీ మారగా, ఆ తర్వాత ఎస్పీవై రెడ్డి, గురువారం సాయంత్రం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పార్టీ మారారు.
No comments:
Post a Comment