తెలంగాణ న్యూస్‌టుడే:
*మున్సిపాలిటి నిర్లక్ష్యం వల్లే ఈఘటన.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చెనుగోనిపల్లీ గ్రామ పెద్ద చెరువులో రూ.10 లక్షల విలువ గల చేపలు గురువారం మృతి చెందాయి. చేపల మృతికి పట్టణం నుంచి వెలువడే కలుషిత నీరే ప్రధాన కారణమని,మున్సిపాలిటీ నిర్లక్ష్యం కారణంగానే నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చెరువులో కలుషిత నీరు కలవకుండా చూడాలని పలుమార్లు మునిసిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వారు అంటున్నారు. ఈ చెరువు నీరు పంట పొలాలకు పారడంతో పంటల దిగుబడులు రావడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

No comments:
Post a Comment