Friday, March 22, 2019

మామా… ఏక్‌ పెగ్‌ లా!


అనంతపురం న్యూస్‌టుడే: హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా పట్టణంలో వైన్‌షాపులు కిటకిటలాడాయి. ఏ మద్యం దుకాణం వద్ద చూసినా టీడీపీ కార్యకర్తలే కనిపించారు. ఆర్‌అండ్‌బీ గెస్‌హౌస్ట్, మేళాపురం క్రాస్‌ బైపాస్‌రోడ్డు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు మద్యం సీసాలతో దర్జాగా కనిపించారు. ఆ మత్తులోనే వాహనాల్లో తిరుగుతూ పట్టణప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. దీనిపై ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!.

No comments:

Post a Comment