గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే:
చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించిన విజయసాయి.
ఏప్రిల్ 11న బాబుకు వాతలుపెట్టేందుకు కర్రు కాల్చుతున్నారని వ్యాఖ్యలు.
ఐదేళ్లు పాలించిన చంద్రబాబు తానేం చేశాడో చెప్పలేకపోతున్నాడని ఆరోపణ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఒంటికాలిపై లేచే వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఏప్రిల్ 11న వాతలు పెట్టేందుకు కర్రును కొలిమిలో వేడిచేయడం మొదలుపెట్టారంటూ ట్వీట్ చేశారు. ‘ప్రజల జ్ఞాపక శక్తి, మేధస్సుపై చంద్రబాబుకు చిన్నచూపు ఉంది. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు కనిపెట్టిన దగ్గర నుంచి సంక్రాంతికి గ్రామాలకు వెళ్లి పండుగ చేసుకోవాలనేది కూడా తమను చూసే ప్రజలు అలవాటు చేసుకున్నారన్నప్పుడే కర్రును కొలిమిలో వేడి చేయడం మొదలు పెట్టారు. ఏప్రిల్ 11న వాతలు పెడతారు’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు

No comments:
Post a Comment