Wednesday, April 3, 2019

ఉత్తమ జర్నలిస్టుగా రత్నాకర్.....

తెనాలి:న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…….
  • పటణంలో ప్రముఖలకు ప్రతిభా పురస్కారాలు అందజేయుట  ….
  • జాతీయ సమాచార సంఘ వార్షికోత్సవంలో భాగం
    గా తెనాలి పటణంలో ప్రముఖలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 
  • అందులో భాగంగా జర్నలిస్టుగా, రత్నాకర్ ఉత్తమ లోకల్ మీడియా వేజెండ్ల ఉదయభాస్కర్, ఉత్తమ యాపారవేత్తగా వాసిరెడ్డి, బద్రి ప్రసాద్, సేవారంగంలో కిషోర్, ఆమీరినేని పురస్కారాలు అందుకున్నారు.                                                                                                                  

                                                                                                                 డెస్క్:దుర్గ  

ఏరులై పారుతున్న మద్యం ..

కృష్టా న్యూస్‌టుడే:
  • జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఓటర్లను ప్రభావితంచేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు మద్యం సరఫరా చేస్తూ పోలీసులకు ప
    ట్టుబుడుతున్నారు.
  • ఎన్నికల తేది దగ్గర పడే సమయంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని..
  • అధికారులు స్పందించి, కట్టు దట్టమైన భద్రత చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
                                                                                                            డెస్క్: లక్ష్మీ

పిల్లలను కూడా వదలని వైసీపీ కార్యకర్తలు……

అమరావతి న్యూస్‌టుడే:
అమరావతిలో ఈరోజు టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు   టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ నేతల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. వీళ్ల దుర్మార్గాలతో తరతరాల అభివృద్ధి అగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.పుంగనూరులో   వైసీపీ నేతల్ బేదిరింపులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు, మైలవరంలో వైసీపీ నేతలు రణరంగం సృ
ష్టించారని దుయ్యబట్టారు. పోలీసులు, జవాన్లపై చెప్పులు రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు పొన్నూరులో స్కూలు పిల్లలు ఆటోలపై కూడా వైసీపీ దాడి చేశారని చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టలేదని వ్యాఖ్యానించారు.
                                                                                                                                                                                                                                                                                                                                                                       డెస్క్:కోటి  

Monday, March 25, 2019

మంచిమాట.

ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం. కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం.

Saturday, March 23, 2019

రైతుకు భరోసా ఇచ్చిన నేత ….

శ్రీకాకుళం  న్యూస్‌టుడే:
*రైతాంగాన్ని కాపాడాలని, వ్యవసాయాన్ని  పునరుద్ధరించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృఢ నిశ్చయంతో…
*తాను రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో  ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా’ పేరిట రైతాంగాన్ని అదుకుంటామని ధైర్యం…
రైతు దేశానికి వెన్నెముక. రైతు లేనిదే తినడానికి తిండి లేదు. జీవనం లేదు. ప్రజలందరికీ  అన్నం పెట్టే రైతులు అర్ధాకలితో, ఆర్థిక ఇబ్బందులతో, రుణ భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందరి జీవితాలతో ముడిపడి ఉన్న రైతులు ఆధారపడిన వ్యవసాయ రంగం మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో రైతులకు వ్యవసాయం చేయడం సమస్యగా మారింది. గతి లేక వ్యవసాయం చేస్తే, చివరిలో విపత్తు వస్తే, ఆ ఏడాది పంట తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ పరిస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడాలని, వ్యవసాయాన్ని  పునరుద్ధరించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారు.ఈ మేరకు రైతాంగానికి, వ్యయసాయ రంగానికి మేలు చేసేందుకు ముందుకువచ్చారు.  తాను రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో  ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా’ పేరిట రైతాంగాన్ని అదుకుంటామని ధైర్యం చెబుతున్నారు.  ఈ హామీతో సగటు రైతుకు ఏడాదిలో కనీసం ఒక రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. ఏటా రూ.12,500 ఆర్థిక సాయం, ఉచిత బోరు, ఉచిత విద్యుత్, రోడ్‌ ట్యాక్స్, సున్నా వడ్డీ వంటి సేవలతో రైతులకు ప్రతి ఏటా ప్రయోజనం చేకూరుతుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీతో ప్రతి రైతు  ధైర్యంగా వ్యయసాయం చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంటుంది.

న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసిన బాబు…..


విజయవాడ న్యూస్‌టుడే:
* టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేశారు.
 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో వున్న నాల్గవ అడిషినల్ సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేశారు. కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున నామినేషన్ పత్రాలను నిన్న టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేశారు. అయితే అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారి వద్ద ప్రమాణం చేయాల్సి ఉండగా.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన ప్రమాణం చేయలేకపోయారు. దీంతో ఇవాళ ఉదయం చంద్రబాబు సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేశారు

కెమెరాలుంటే ధర్నాకు దిగుతాం….


జగిత్యాల న్యూస్‌టుడే: 
*ఎక్కువ నిధులు రాబట్టొచ్చని ఎంపీ కవిత చెప్పారు
కాంగ్రెస్ నేతలపై ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కెమెరాలుంటేనే తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేస్తారని విమర్శించారు. తెలంగాణ కోసం అరగంటకు మించి కొట్లాడలేరని ఎద్దేవా చేశారు. శనివారం ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ కవిత.. ఢిల్లీ మెడలు వంచింది కేసీఆరే అని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. వాళ్లతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే.. కేంద్రంలో మనమే కీలకం కావొచ్చని, తెలంగాణ అభివృద్ధికి ఎక్కువ నిధులు రాబట్టొచ్చని ఎంపీ కవిత చెప్పారు

విద్యార్ధులలో చైతన్యం రావాలి ఉచితంగా ఎంసెట్‌ శిక్షణ….


శ్రీకాకుళం న్యూస్‌టుడే: 
జీఎంసీ బాలయోగి గురుకుల విద్యా సంస్థల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ఎంసెట్‌ ప్రవేశపరీక్షకు శిక్షణ ఇవ్వనున్నామని గురుకులాల జిల్లా సమన్వయకర్త యశోధలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఎచ్చెర్ల మండలం దుప్పలవలస గ్రామంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో ఎంసెట్‌ శిక్షణా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. బాలురుకు దుప్పవలస, బాలికలకు ఎచ్చెర్ల గురుకుల పాఠశాలల్లో ఉచిత భోజనం, వసతి కల్పించి శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన అధ్యాపకులతో బోధించటం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు దువ్వాడ దేవేంద్రరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పెళ్లి పత్రిక ప్రాణంగా మారింది …..


ఆలగడప నల్గొండ న్యూస్‌టుడే: 
ఐదు రోజుల్లో బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆళ్లగడపకు చెందిన నిమ్మల సోమయ్య(45) తన పెద్ద కుమారుడు నరేశ్‌కు ఈ నెల 28న వివాహం జరగనుంది. బంధువులను ఆహ్వానించేందుకు పెళ్లి పత్రికలు తీసుకొని శుక్రవారం కోదాడకు వచ్చాడు. తిరిగి మునగాల మండలం ముకుందాపురంలోని బంధువులకు పత్రికలు పంచి తన ద్విచక్రవాహనంపై సూర్యాపేట వైపునకు గుంజలూరు స్టేజీ సమీపంలోకి రాగానే తన వాహనం నుంచి పత్రికలు ఉన్న సంచి తెగిపోయి రహదారిపై పడి పత్రికలు కొన్ని చెల్లాచెదురుగా పడ్డాయి. ద్విచక్రవాహనాన్ని పక్కన పెట్టి రహదారిపై పడిన పత్రికలు ఏరుతున్న క్రమంలో విజయవాడ వైపు నుంచి అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం సోమయ్యను ఢీకొట్టింది.తలకు బలమైన గాయాలై రహదారిపై పడి ఉండగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108లో సూర్యాపేటకు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లి పనుల్లో నిమగ్నమైన కుటుంబ పెద్ద సోమయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామమైన మిర్యాలగూడ మండలం ఆలగడపలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్ద అకాల మృతితో బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
                                                                         

ఉపాధ్యాయుల భళా… పట్టభద్రులు డీలా…..!


సంగారెడ్డి  న్యూస్‌టుడే: 
మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గట్టి భద్రత మధ్య పోలింగ్‌ సాగింది. సీసీ కెమెరాలు, వెబ్‌ కాస్టింగ్‌  చేశారు. ఓటుహక్కును వినియోగించుకోవడంలో  ఉపాధ్యాయులు తమ ప్రత్యేకతను చాటారు.సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల సహాయకుల ఆర్‌డీఓ పర్యవేక్షణలో ఎన్నికలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా పట్టభద్ర ఓటర్లు 13,018 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 2344 మంది ఉన్నారు. అందుకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా 68 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల్లో 7705 మంది, ఉపాధ్యాయుల్లో 1923 మంది ఓటేశారు. పోలింగ్‌ పూర్తి కాగానే ఆయా పెట్టెలను ఆర్‌డీఓ కార్యాలయాల నుంచి కరీంనగర్‌ జిల్లాకు పంపించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈనెల 26న కరీంనగర్‌లో ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.

సరదాగావచ్చి స్వర్గానికే వెళ్లేవా …..


శ్రీకాకుళం అరసవల్లి, న్యూస్‌టుడే: 
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో పీయూసీ-2 చదువుతున్న ఎచ్చెర్ల మండలం జరజాం గ్రామానికి చెందిన జరుగుళ్ల వినయ్‌కుమార్‌(17) ద్విచక్రవాహనం ఢీకొట్టిన ప్రమాదంలో మృతిచెందాడు.ఎచ్చెర్ల మండలంలోని చినరావుపల్లి వద్ద ఉన్న ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో చదువుతున్న వినయ్‌కుమార్‌ నాలుగురోజుల క్రితం జరజాంలో ఉన్న ఇంటికి వచ్చాడు.బుధవారం సొంతపనిపై శ్రీకాకుళం వెళ్లి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైతుబజారు సమీపంలో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో వినయ్‌కుమార్‌ తలవెనుక భాగంలో గాయమయింది. వెంటనే స్థానికులు 108 వాహనంలో రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో అదేరోజు మధ్యాహ్నం మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. వినయ్‌కుమార్‌ తండ్రి రామారావు తాపీ మేస్త్రి కాగా తల్లి గృహిణి. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
                                                                                                        

గజరాజుల తడాకా …


శ్రీకాకుళం  న్యూస్‌టుడే :
 
ఎల్‌ఎన్‌పేట మండలంలో శుక్రవారం వేకువ జామున ఏనుగులు హల్‌చల్‌ చేశాయి. ఏనుగులు కరకవలస కొండ నుంచి కుసుమలపాడు, చింతలబడవంజ, తురకపేట కూడలి వరకు వచ్చాయి. అటవీశాఖ అధికారులు, స్థానిక యువత మంటలు, బాణసంచాలు పేల్చటంతో వెనుదిరిగాయి. చింతాడ వెంకటరమణ, పేడాడ సన్యాసిరావు, కూన సత్యం తదితర రైతులకు సంబంధించిన ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. వీఆర్వో రామప్పడు ఆ గ్రామాల్లో పర్యటించి ఏనుగులు కలిగించిన నష్టాన్ని అంచనా వేశారు. తహసీల్దారుకు నివేదిక అందజేస్తున్నట్లు తెలిపారు.

31 కేసులు ఉన్న వ్యక్తికి, హత్యారాజకీయాలు చేసే వ్యక్తికి ఎవరైనా ఓటేస్తారా ..


విపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. 31 కేసులు ఉన్న వ్యక్తికి, హత్యారాజకీయాలు చేసే వ్యక్తికి ఎవరైనా ఓటేస్తారా అని ప్రశ్నించారు. నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ 48 పేజీల్లో 31 కేసులు నమోదై ఉండడం జగన్‌ అరాచక శక్తి అనేందుకు ఆధారమని ధ్వజమెత్తారు. దేశంలో మరే రాజకీయ నాయకుని అఫిడవిట్‌లోనూ ఇన్ని కేసులు ఉండవేమోనన్నారు. అమరావతిలోని తన నివాసంలో ఎలక్షన్‌ మిషన్‌ 2019పై టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలతో ఈరోజు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చిన్నాన్న హత్యను కూడా జగన్‌ రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకోవడం నీచమన్నారు. కేసీఆర్‌, మోదీలకు జగన్‌ బానిసగా మారారని, వీరంతా ఆంధ్రాద్రోహులని ధ్వజమెత్తారు. ఆంధ్రా ద్రోహులకు ఓటుతో తగిన బుద్ధిచెప్పి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

చెదురుతున్న ‘డాలర్‌ డ్రీమ్స్‌’!


ఢీల్లీ న్యూస్‌టుడే:  అమెరికాలో భారతీయుల డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోతున్నాయి. అమెరికా ప్రభుత్వం రక్షణాత్మకంగా వ్యవహరిస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న వేలాది మంది భారత ఐటీ నిపుణులు వీసా తిరస్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. తమ వీసా గడువును పొడిగించాల్సిందిగా దాఖలు చేస్తున్న దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. లేదంటే రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌(ఆర్‌ఎఫ్‌ఈ)లను సమర్పించాల్సిందిగా పదేపదే అడుగుతున్నారు. ఆర్‌ఎఫ్‌ఈలను పొందిన ఉద్యోగులకు వీసా పొడిగింపు దక్కుతుందన్న గ్యారెంటీ ఏమీలేదు. ‘నా స్నేహితురాలు ఇక్కడే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు ఓ బాబు ఉన్నాడు. హెచ్‌1బీ వీసా పొడిగింపుతో పాటు గ్రీన్‌కార్డు కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. కానీ ఆ రెండు దరఖాస్తులూ తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆమె కుమారుడితో కలిసి అమెరికాను వీడాల్సి వచ్చింది’అని జునేజా అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చెప్పారు.
                               

చైనాలో ఘోర ప్రమాదం, 26మంది మృతి….


బీజింగ్  న్యూస్‌టుడే:  చైనాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 26మంది మృతి చెందగా, మరో 28మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే… సెంట్రల్‌ చైనా..హ్యూనన్‌ ఫ్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తూ ఓ పర్యాటక బస్సులో మంటలు చెలరేగి 26మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన మరో 28మందిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు  అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటన జరిగినప్పుడు బస్సులో మొత్తం 53మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో పాటు టూరిస్ట్‌ గైడ్‌ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరోవైపు చైనాలోని ఓ పారిశ్రామిక వాడలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 64కి చేరింది. మరో 640మంది గాయపడ్డారు.

మనుషులా లేక మృగాలా…….


మునిగుడ,ఒడిశా  న్యూస్‌టుడే:
ఇంట్లో కొన్నాళ్లుగా అశుభం జరుగుతుందన్న నెపంతో ఆరునెలల కన్న బిడ్డను తల్లిదండ్రులే హతమార్చిన ఘటన రాయగఢ జిల్లా మునిగుడ సమితి బడపంగిడి గ్రామంలో చోటుచేసుకుంది. 15 తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అంబొదల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సమదల గ్రామ సమీపంలో ఆరునెలల ఆడ శిశువు మృతదేహాన్ని ఈ నెల 15న రత్నాకర్‌ బాగ్‌ అనే గ్రామ రక్షకుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్డీపీఓ చంద్రశేఖర్‌ హోతా ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బడపంగిడి గ్రామానికి చెందిన రీతా ఉదాలి, జగదీష్‌ ఉదాలిల కుమార్తెగా గుర్తించారు. 17న రీతా, జగదీష్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. ఉన్ని ఉదాలి పుట్టిన తర్వాత ఇంట్లో అన్నీ అశుభాలే జరగడంతో 12న గ్రామ శివారులో పీక నులిమి చంపినట్లు అంగీకరించారు. అంబొదల పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరినీ కోర్టుకు తరలించారు.

టికెట్లు కావాలంటే కోట్లు ఉండాలి….


తెలంగాణ న్యూస్‌టుడే:
కేసీఆర్‌ను చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయని విమర్శించారు.
కోటీశ్వరులకు మాత్రమే కేసీఆర్ ఎంపీ టికెట్లు ఇచ్చారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను టీఆరెస్ కొనుగోలు చేస్తుందన్న ఆయన.. కేసీఆర్‌ను చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే వలస పోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీగా మారిందని లక్ష్మణ్ విమర్శించారు.

మార్కెట్లోకి ‘ట్రెండ్‌ ఈ’ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ……..


ఢీల్లీ న్యూస్‌టుడే:
  •  ధరల శ్రేణి రూ. 56,900 – రూ. 81,269 …
  • ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ అవన్‌ మోటార్స్‌..
‘ట్రెండ్‌ ఈ’ పేరుతో నూతన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. సింగిల్‌ బ్యాటరీ కలిగిన స్కూటర్‌ ధర రూ.56,900 కాగా, డబుల్‌ బ్యాటరీ స్కూటర్‌ ధర రూ.81,269. రెండు నుంచి నాలుగు గంటల్లో పూర్తిగా చార్జయ్యే విధమైన లిథియం–అయాన్‌ బ్యాటరీని ఈ స్కూటర్లలో అమర్చినట్లు తెలిపింది. సింగిల్‌ బ్యాటరీ స్కూటర్‌ గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, డబుల్‌ బ్యాటరీ స్కూటర్‌ 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని సంస్థ ప్రకటించింది.రూ.1,100 చెల్లించి స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ పంకజ్‌ తివారీ మాట్లాడుతూ.. ‘ప్రీ–బుకింగ్స్‌ సమయంలో ఈ స్కూటర్స్‌కు విశేష స్పందన మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ స్కూటర్‌ ఫీచర్లు కస్టమర్లకు బాగా నచ్చుతాయని భావిస్తున్నాం’ అని అన్నారు.
                                                                                  

Friday, March 22, 2019

ఏపీ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన..


ఆంధ్రప్రదేశ్ లో ఓట్లను తొలగించాలని దాఖలైన దరఖాస్తుల్లో 85 శాతం నకిలీ దరఖాస్తులేనని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది. ఓట్లను తొలగించాలని తమకు 9.5 లక్షల ఫామ్-7 దరఖాస్తులు అందాయని వెల్లడించింది. వాటిలో కేవలం 1.41 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించామనీ, నకిలీ ఓట్లను తొలగించామని పేర్కొంది. వీటిలో సగం ఓట్లు గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలలోనే ఉన్నాయని వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం ఏపీలో 3.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల పర్వం ముగిసేసరికి తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 3.93 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. త్వరలోనే తుది జాబితాను రాజకీయ పార్టీలకు అందిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది.

నాటు తుపాకులు స్వాధీనం నలుగురి అరెస్టు…….


భువనేశ్వర్ న్యూస్‌టుడే:
అక్రమంగా ఆయుధాలు తయారుచేసే పరిశ్రమపై సంబల్‌పూర్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. నలుగురిని అరెస్టు చేయడంతోపాటు మూడు తుపాకులు, ఒకటి సగం తయారీలో ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. రెంగాలీ ప్రాంతంలో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు అక్రమంగా తుపాకులు తయారుచేసే పరిశ్రమపై సమాచారం అందగా రెంగాలీ ఠాణా అధికారి సంజయ్‌ సాహు నేతృత్వంలో పోలీసుల బృందం తుపాకులు తయారవుతున్న ఇంటిపై దాడులు చేసింది. దాడుల్లో సుధీర్‌ సాహు, బిషబ్‌ మిర్టా, అర్జున్‌ నాయక్, దుర్గా టప్పాలను అరెస్టు చేశారు. తుపాకులు తయారుచేసే సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు.
                

ఈరోజు విజయవాడ సివిల్ కోర్టులో ప్రమాణం..


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తరపున టీడీపీ నేతలు నిన్న నామినేషన్ ధాఖలు చేశారు. కుప్పం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారి వద్ద చంద్రబాబు ప్రమాణం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న నాల్గవ అడిషనల్ సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. 

అభివృద్ధిని చూసి ఓటేయండి…….


ఒడిశా  న్యూస్‌టుడే:
శుక్రవారం రాత్రి పర్లాఖెముండి రాజప్రసాదం ప్రాంగణంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో మన రాష్ట్రానికి నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వం కొనసాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్ని వర్గాల వారి సంక్షేమానికి నవీన్‌పట్నాయక్‌ చేపడుతున్న పథకాలు అనన్యసామాన్యం అని వివరించారు. జాతీయస్థాయిలో పలు సంస్థలు, పలువురు నాయకులు నవీన్‌పట్నాయక్‌ను ఉత్తమ ముఖ్యమంత్రిగా పేర్కొంటున్నారన్నారు. కాశీనగర్‌ ఎన్‌.ఎ.సి. మాజీ అధ్యక్షురాలు మేడిబోయిన సుధారాణి మాట్లాడుతూ కళ్యాణి గజపతి తెలియదు అనేవారికి నేను ఒడిశావాసిని అనేహక్కు లేదన్నారు. ఒడిశా రాష్ట్ర అవతరణకు, పర్లాఖెముండి ప్రాంత అభివృద్ధికి గజపతుల వంశం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వాటి ఫలాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు. బిజద జిల్లా అధ్యక్షుడు ప్రదీప్‌నాయక్, బసంతకుమార్‌ దాస్, కళ్యాణిగజపతి, లక్ష్మికాంత పొరిచ్చా తదితరులు ప్రసంగించారు.

అక్రమ సంబంధంలో కసాయి తల్లి …..


తమిళనాడు ప్యారిస్‌ న్యూస్‌టుడే:
*వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కుమార్తెను హతమార్చిన తల్లిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.వారి కథనం మేరకు…
నీలగిరి జిల్లా ఊటివద్ద కొడప్పమందు అంబేడ్కర్‌ కాలనీకి చెందిన జగన్నాథన్‌ (40), ఇతని భార్య రాజ్యలక్ష్మి (35), వీరి కుమార్తె ఉషారాణి (11) ఊటిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతుంది. రెండేళ్ల కిందట జగన్నాథన్‌, రాజ్యలక్ష్మి అభిప్రాయ బేధాలతో విడిపోయారు. దీంతో ఉషారాణి తల్లితో ఉంటుంది. అదేవిధంగా రాజ్యలక్ష్మికి పక్కింటి యువకుడికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం తన కుమార్తె ఊయల ఊగుతూ తాడు చుట్టుకుని సృహ కోల్పోయిందని ఏడుస్తూ ఊటి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఉషారాణిని పరిశీలించిన డాక్టర్లు ఆమె మృతి చెందినట్లు తెలిపి పోస్టుమార్టం నిర్వహించారు.  కేసును నమోదు చేసుకున్న పోలీసులు రాజ్యలక్ష్మి వద్ద విచారించగా పొంతనలు లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అప్పుడు రాజ్యలక్ష్మి తన వివాహేతర సంబంధానికి ఉషారాణి అడ్డుగా ఉందని గొంతునులిమి చంపినట్లు తెలిపింది. అనంతరం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

నాగబాబు, ఆయన భార్య పేరుపై ఉన్న ఆస్తులివే!


మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు జనసేన టికెట్ పై నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనతో పాటు తన భార్య పేరిట రూ.41 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నాగబాబు అఫిడవిట్ లో తెలిపారు. ఇందులో స్థిరాస్తులు రూ.4.22 కోట్లుగా ఉండగా, చరాస్తులు రూ.36.73 కోట్ల మేర ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఇద్దరి పేరుపై రూ.2.70 కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.

నిరుద్యోగ మే కారణం….


తమిళనాడు ప్యారిస్‌ న్యూస్‌టుడే: 
 
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి  రూ. కోటి నగదును తీసుకుని మబ్యపెట్టి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు…తిరునెల్వేలి జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎరగా చూపుతూ మేలప్పాళెయంలో ఉన్న ప్రైవేటు ఏజెన్సీ సంస్థ నగదు వసూలు చేసింది. విదేశాల్లో లక్షల జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. కోటి నగదు వరకూ వసూలు చేయడం జరిగింది. ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో 36 మంది బాధితులు తిరునెల్వేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి జాకీర్‌హుస్సేన్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నారు.

చూపుడు వేలు లేకుంటే.!


న్యూస్‌టుడే: పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎడమచేతి చూపుడువేలుకు సిరా చుక్క పెడతారు. ఓటు వేసే వ్యక్తికి ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే ఎలా,.. దీనికి ఎన్నికల సంఘం ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. ఎడమచేతికి చూపుడు వేలు లేకుంటే మధ్య వేలుకు, అదీ లేకుంటే బొటన వేలుకు సిరాచుక్క వేసే అవకాశం కల్పించింది. ఎడమ చేతికి అసలు వేళ్లు లేకుంటే కుడి చేతి చూపుడు వేలుకు అదీ లేకుంటే ఈ తర్వాత ఏది ఉంటే ఆ వేలుకు చుక్క పెడతారు. రెండు చేతులకూ వేళ్లు లేకుంటే వేళ్ల మొదళ్ల మధ్య భాగంలో లేకుంటే చేయిపై రాస్తారు.

జగనన్నను చూసే.. కష్టాలను తట్టుకోవడం నేర్చుకున్నా…….


విజయనగరం  న్యూస్‌టుడే: ఒక సాధారణ గిరిజన ఉద్యోగి కుటుంబానికి చెందిన ఆమెకు… మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై అభిమానం ఏర్పడింది. విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహం తర్వాత కూడా అది అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో అనూహ్యంగా దక్కిన రాజకీయ అవకాశం ఆమెను ఎమ్మెల్యే చేసింది. ఆ తర్వాత ప్రజా ప్రతినిధిగా, రాజకీయ నేత భార్యగా జీవితంలో సమతూకం పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు గెలుచుకున్నారు. ఎవరూ వెళ్లేందుకు సాహసించని మారుమూల గిరిజన పల్లెల్లో ప్రతి గడప తొక్కుతూ, ప్రతి ఇంటి సమస్య తెలుసుకుని పరిష్కరిస్తూ జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు విజయనగరం జిల్లా కురుపాం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి.
                                                                                

ఎన్టీఆర్ బయోపిక్ ను అంకితం చేస్తున్నా: వర్మ


నాన్నగారి బయోపిక్ తీయాలనుకుంటున్నా’ అంటూ గతంలో బాలకృష్ణ తనను కలిశారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. సినిమాలో కాన్ ఫ్లిక్ట్ ఉంటేనే తాను సినిమా తీయగలనని బాలయ్యకు చెప్పానని తెలిపారు. ఎన్టీఆర్ గారికి సంబంధించిన కొందరు వ్యక్తులను బాలయ్యే తనకు పరిచయం చేశారని… వారి నుంచే తాను సమాచారం సేకరించి, సినిమా మొదలుపెట్టానని చెప్పారు. అందుకే ఈ సినిమాను బాలయ్యకు అంకితం చేస్తున్నానని తెలిపారు.
తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని… ఏ పార్టీ నెగ్గినా తనకు లాభం లేదని, నష్టమూ లేదని వర్మ తెలిపారు. ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో లేదా ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో సినిమా తీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. పాతికేళ్ల క్రితం జరిగిన కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ, వైసీపీకి అనుకూలంగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాను ఫిల్మ్ మేకర్ నని, బిజినెస్ మెన్ కాదని చెప్పారు.