Saturday, March 23, 2019

చెదురుతున్న ‘డాలర్‌ డ్రీమ్స్‌’!


ఢీల్లీ న్యూస్‌టుడే:  అమెరికాలో భారతీయుల డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోతున్నాయి. అమెరికా ప్రభుత్వం రక్షణాత్మకంగా వ్యవహరిస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న వేలాది మంది భారత ఐటీ నిపుణులు వీసా తిరస్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. తమ వీసా గడువును పొడిగించాల్సిందిగా దాఖలు చేస్తున్న దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. లేదంటే రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌(ఆర్‌ఎఫ్‌ఈ)లను సమర్పించాల్సిందిగా పదేపదే అడుగుతున్నారు. ఆర్‌ఎఫ్‌ఈలను పొందిన ఉద్యోగులకు వీసా పొడిగింపు దక్కుతుందన్న గ్యారెంటీ ఏమీలేదు. ‘నా స్నేహితురాలు ఇక్కడే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు ఓ బాబు ఉన్నాడు. హెచ్‌1బీ వీసా పొడిగింపుతో పాటు గ్రీన్‌కార్డు కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. కానీ ఆ రెండు దరఖాస్తులూ తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆమె కుమారుడితో కలిసి అమెరికాను వీడాల్సి వచ్చింది’అని జునేజా అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చెప్పారు.
                               

No comments:

Post a Comment