Friday, March 22, 2019

పట్టుబడిన డబ్బు బంగారం…..


మంచిర్యాల న్యూస్‌టుడే:
*పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
మంచిర్యాల జిల్లాలో భారీగా నగదు, బంగారం పట్టివేత సంచలనం సృష్టించింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేఫథ్యంలో.. సీసీసీ నస్పూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో.. గురువారం తెల్లవారుజామున 3గంటలకు హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఉబర్‌ క్యాబ్‌ స్విఫ్ట్‌ కారు (టీఎస్‌ 13యూఏ 7178)లో రూ. 26.76 లక్షలు నగదుతో పాటు రూ. 16.29 లక్షల విలువ చేసే బంగారం పట్టుబడింది. డ్రైవర్‌ వద్ద ఎటువంటి రశీదులు లేకపోవడంతో, పట్టుబడిన నగదును ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ 002 పెద్దపల్లి పార్లమెంటరీ ఇంచార్జికు స్వాధీనపరిచామని ఎస్సై ప్రమోద్‌రెడ్డి పేర్కొన్నారు.

No comments:

Post a Comment