చేతిగోళ్లు అందంగా కనపడాలంటే మెనిక్యూర్ ఒక్కటే మార్గం కాదు. గోళ్ల పైభాగం అందంగా కనిపించాలంటే వాటి లోపలి భాగం కూడా ఆరోగ్యంగా ఉండాలి. జింకు లోపం వల్ల గోళ్లు ఎంతో బలహీనంగా ఉండి ఇట్టే చిట్లిపోతుంటాయి. అంతేకాదు గోళ పై భాగంలో చిన్న చిన్న తెల్లటి మచ్చలు కూడా వస్తాయి. ఇవి రాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం గుమ్మడిగింజలు, నువ్వులగింజలు, ఓట్స్ తింటే మంచిది. వీటిలో జింకు బాగా ఉంటుంది.

No comments:
Post a Comment