మేడ్చల్ న్యూస్‌టుడే:
* బీహార్‌కు చెందిన ఆరుగురు సభ్యులు……
అల్వాల్ పీఎస్ పరిధి తుర్కపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. దుండగులు బాలికను హత్య చేసి ముళ్లపొదల్లో పడేశారు. మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బీహార్‌కు చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

No comments:
Post a Comment