Saturday, March 23, 2019

ఉపాధ్యాయుల భళా… పట్టభద్రులు డీలా…..!


సంగారెడ్డి  న్యూస్‌టుడే: 
మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గట్టి భద్రత మధ్య పోలింగ్‌ సాగింది. సీసీ కెమెరాలు, వెబ్‌ కాస్టింగ్‌  చేశారు. ఓటుహక్కును వినియోగించుకోవడంలో  ఉపాధ్యాయులు తమ ప్రత్యేకతను చాటారు.సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల సహాయకుల ఆర్‌డీఓ పర్యవేక్షణలో ఎన్నికలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా పట్టభద్ర ఓటర్లు 13,018 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 2344 మంది ఉన్నారు. అందుకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా 68 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల్లో 7705 మంది, ఉపాధ్యాయుల్లో 1923 మంది ఓటేశారు. పోలింగ్‌ పూర్తి కాగానే ఆయా పెట్టెలను ఆర్‌డీఓ కార్యాలయాల నుంచి కరీంనగర్‌ జిల్లాకు పంపించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈనెల 26న కరీంనగర్‌లో ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.

No comments:

Post a Comment