Friday, March 22, 2019

ఇలాంటి చౌకీదార్ అవసరమా….


లఖ్‌నవ్ న్యూస్‌టుడే:
*ప్రజా సమస్యలను వదిలేసి, ‘చౌకీదార్’ అనే నినాదాన్ని ఉపయోగిస్తోందని…
*దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని…
*భాజపా నేతలు తమ పేర్ల ముందు చౌకీదార్‌ అనే పదాన్ని పెట్టుకుంటున్నారు…
భాజపా.. ప్రజా సమస్యలను వదిలేసి, ‘చౌకీదార్’ అనే నినాదాన్ని ఉపయోగిస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. భాజపా నేతలందరూ సామాజిక మాధ్యమాల్లో తమ పేర్ల ముందు చౌకీదార్‌ (కాపలాదారుడు) అని చేర్చుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె ట్విటర్‌లో భాజపా నేతలపై విమర్శలు గుప్పించారు. ‘‌రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పంద దస్త్రాలు చోరీకి గురయ్యాయన్న విషయాన్ని వారు పట్టించుకోలేదు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని తెలిపే డేటాతో పాటు పేదరికం, రైతులు, కూలీల సమస్యలు బహిర్గతం కాకుండా ప్రయత్నిస్తున్నారు. ఓట్ల కోసమే ఇటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దేశానికి ఇటువంటి చౌకీదార్‌ అవసరమా?’ అని ఆమె ట్వీట్ చేశారు. ‘భాజపా నేతలు తమ పేర్ల ముందు చౌకీదార్‌ అనే పదాన్ని పెట్టుకుంటున్నారు. అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వంటి వారు ఈ విషయంలో కాస్త ఇరకాటంలో పడ్డారు. తమ పేరు ముందు జనసేవక్‌ అని పెట్టుకోవాలా? యోగి అని పెట్టుకోవాలా లేదా చౌకీదారా? అని అయోమయంలో పడ్డారు. వారు తమకు ఇష్టం వచ్చిన పనిని చేసుకోవచ్చు. కానీ, దేశ రాజ్యాంగం, చట్టాలకు కట్టుబడి ఉండి బాధ్యతలు నిర్వర్తించాలి. ఇదే దేశ ప్రజలకు కావాలి’ అంటూ మాయావతి వరుస ట్వీట్లు చేస్తూ విమర్శలు గుప్పించారు.
                              

No comments:

Post a Comment