Friday, March 22, 2019

సొర పొట్టు ….


తయారీకి కావాలసినవి:-
  • సొర చేప ముక్కలు: పావుకిలో,
  • ఉల్లిపాయలు: రెండు,
  • పచ్చిమిర్చి: మూడు,
  • కొత్తిమీర: కట్ట,
  • అల్లంవెల్లుల్లి: టీస్పూను,
  • గరంమసాలా: పావుకిలో,
  • పసుపు: పావుటీస్పూను,
  • ఉప్పు: రుచికి సరిపడా,
  • నూనె: 2 టేబుల్‌స్పూన్లు,
  • కారం: టీస్పూను,
  • కరివేపాకు: 2 రెబ్బలు.
తయారుచేసే విధానం:-
చేపముక్కల్ని శుభ్రంగా కడగాలి.  ఓ గిన్నెలో నీళ్లు పోసి, ఉప్పు, పసుపు వేసి చేపముక్కలు కూడా వేసి పది నిమిషాలు ఉడికించాలి. ముక్కల్ని పక్కకు తీసి చిదిమి పొరటులా చేయాలి. నూనెలో ఉల్లి, పచ్చిమిర్చిముక్కలు వేసి మూడు నిమిషాలు వేయించాలి. అల్లంవెల్లుల్లి వేసి వేగాక, పసుపు, కారం, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి. కొత్తిమీర తురుము వేసి రెండు నిమిషాలు వేయించాక, మెదిపిన సొరచేప పొట్టు వేసి సిమ్‌లో ఐదు నిమిషాలు వేయించి దించాలి.

No comments:

Post a Comment