కర్నూలు న్యూస్‌టుడే :
*రూ.20 లక్షల విలువైన అమ్మకాల నిలుపుదల..
మద్యం దుకాణదారులు గొలుసు దుకాణాలకు మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ అదనపు సూపరింటెండెంట్ జానకీరామ్ హెచ్చరించారు. ఆస్పరిలోని సారిక మద్యం దుకాణదారులు బుధవారం మొలగవల్లి గ్రామానికి చెందిన బెల్టు దుకాణానికి మద్యం విక్రయించారు. దీనిని నిర్ధారణ చేసుకుని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావు ఆదేశాల మేరకు గురువారం దుకాణం సీజ్ చేశామని ఆయన వెల్లడించారు. దుకాణంలో ఉన్న రూ.20 లక్షల మద్యాన్ని సీజ్ చేశామని సీఐ మాధవస్వామి చెప్పారు.
No comments:
Post a Comment