Friday, March 22, 2019

ఆకర్షణీయమైన కొత్త ప్యాకింగ్‌తో కాఫీ…

విశాఖ న్యూస్‌టుడే:
*50 గ్రాములు, 100 గ్రాముల టిన్నులతో కొత్త ప్యాకింగ్‌…
*టిన్నుల రూపంలో ప్యాకింగ్‌ చేయడం ద్వారా కాఫీ పౌడర్‌ ఎక్కువ కాలం నిల్వ…
అరకు ఇన్‌స్టెంట్‌ కాఫీ ఆకర్షణీయమైన కొత్త ప్యాకింగ్‌తో ముస్తాబు చేశారు. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఇన్‌స్టెంట్‌ కాఫీని చిన్న చిన్న పౌచ్‌ల రూపంలో దొరికేవి. ప్రస్తుతం 50 గ్రాములు, 100 గ్రాముల టిన్నులతో కొత్త ప్యాకింగ్‌ ద్వారా వినియోగదారులకు అందించాలని మార్పులు చేసినట్లు అధికారులు చెప్పారు. కొత్తగా టిన్నుల రూపంలో ప్యాకింగ్‌ చేయడం ద్వారా కాఫీ పౌడర్‌ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని జీసీసీ ఛైర్మన్‌ బాబూరావునాయుడు తెలిపారు. ఇందులో ప్యూర్‌ కాఫీ, చెకోరి కాఫీ రెండు రకాల పౌడర్లను టిన్ను ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందించనున్నట్లు చెప్పారు. ఇన్‌స్టెంట్‌ కాఫీ 50 గ్రాములు రూ.95, 100 గ్రాములు రూ.180, చెకోరి కాఫీ 50 గ్రాములు రూ.85, 100 గ్రాములు రూ.160 ధర నిర్ణయించినట్లు చెప్పారు.

No comments:

Post a Comment