Friday, March 22, 2019

పూతలపట్టు లో టీడీపీ అభ్యర్ధి మార్పు.


చిత్తూరుజిల్లా:పూతలపట్టు: న్యూస్‌టుడే:
  • వాణిజ్య పన్నుల శాఖ అధికారు తెర్గాం పూర్ణం పేరు ప్రకటన…
  •  కొత్త అభ్యర్ధిని తెచ్చే బదులు పాత అభ్యర్ధినే కొనసాగించడుట…
తెలుగుదేశం పార్టీ ఒక అసెంబ్లీ సీటులో తన అభ్యర్ధిని మార్చింది. చిత్తూరు జిల్లా పూతలపట్టులో తాజా గా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారిని ఖరారు చేసింది. అంతకు ముందు అక్కడ వాణిజ్య పన్నుల శాఖ అధికారు తెర్గాం పూర్ణం పేరు ప్రకటించారు. కానీ స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. లలితకుమారి గత ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారని మళ్ళీ ఆమెనే అభ్యర్ధిగా నిలపాలని కోరారు. వారి విజ్ఞప్తిని పార్టీ అధినాయకత్వం పరిగణనలోకి తీసుకుని ఆమెనే ఖరారు చేసింది. శ్రీశైలంలో  గతంలో ప్రకటించిన బుడ్డా రాజశేఖ్రరెడ్డి నే కొనసాగించాలని నిర్ణయించింది. కుటుంబ సమస్యల కారణంగా పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన. ఆ తర్వాత సీ ఎం ను కలిసి పోటీకి సై అన్నారు. ఆఖరి నిమిషంలో కొత్త అభ్యర్ధిని తెచ్చే బదులు పాత అభ్యర్ధినే కొనసాగించడం మే అని నాయకత్వం భావించింది. ఆ నియోజకవర్గానికి రాజశేఖర్‌రెడ్డి సిటింగ్ ఎమ్మెల్యే కూడా ప్రకాశం జిల్లా దర్శిలో కరిది బాబూరావును కొనసాగించాలని నిర్ణయించారు.

No comments:

Post a Comment