విశాఖ న్యూస్‌టుడే : మీ ఓటుతో మాకు తీపి పంచాలంటూ అనకాపల్లి పార్లమెంట్ తెదేపా అభ్యర్థి ఆడారి ఆనందకుమార్ సతీమణి వరలక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి పీలాగోవింద సత్యనారాయణ సతీమణి విజయలక్ష్మి గురువారం ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పూడిమడక రోడ్డు, రెల్లివీధిలో వీరు ప్రచారం చేశారు. మహిళలకు చంద్రబాబునాయుడు హయాంలో చేసిన అభివృద్ధిని వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెదేపాకు పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెదేపా అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర, తెదేపా నాయకులు సూరే సతీష్, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment