Friday, March 22, 2019

ఆలయ ప్రాంగణంలో కలకలం….


తెలంగాణ న్యూస్‌టుడే: 
*ఆలయంలో ఉన్మాది వీరంగం
*చంపేస్తానని బెదిరింపు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు.చేతితో కత్తి పట్టుకుని ఆలయ ప్రాంగణంలో కలకలం రేపాడు. దగ్గరికి వస్తే చంపుతామని భక్తులను బెదిరించి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఉన్మాది ఇలాంటి చర్యకు దిగడం 2016 నుంచి ఇది ఐదోసారి. నిజామాబాద్‌లోని వర్ని రోడ్‌ ప్రాంతానికి చెందిన శీలవేరు ప్రసాద్‌గౌడ్‌ తల్లిదండ్రులు చిన్పప్పుడే చనిపోయారు.మానసిక స్థితి సరిగాలేని ప్రసాద్‌ గౌడ్‌కు బాసర గుడిలో ఆత్మహత్య చేసుకుంటే స్వర్గానికి వెళ్తారని ఎవరో చెప్పారు. అప్పటి నుంచి బాసరకు వస్తూనే ఉన్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రసాద్‌ పున్నమి, అమావాస్య రోజులనే ఎంచుకుంటున్నాడు. వచ్చిన ప్రతీసారి ఒకే రంగు దుస్తులనే ధరిస్తాడు. ఈ పరిణామం ఆలయాధికారులకు తలనొప్పిగా మారింది.

No comments:

Post a Comment