తయారీకి కావల్సినవి: బియ్యం-రెండు కప్పులు,పంచదార-మూడు స్పూన్లు, నెయ్యి-3స్పూన్లు, పాలు-అరకప్పు, బియ్యప్పిండి-స్పూన్,నూనె-తగినం త.
తయారీ విధానం: బియ్యం 8 గంటలపాటు నానబెట్టలి. తర్వాత ఆ బియ్యన్ని మిక్సీలో మెత్తగా రుబ్బాలి. అందులోనే పంచదార,నెయ్యి,పాలు కూడా పోసి మరోసారి పేస్టులా మెత్తగా అయ్యేవరకూ రుబ్బాలి. పిండి మరి జారుగా కాకుండా గట్టిగానే ఉండాలి. రుబ్బిన తరవాత ఇంకా పలుచగా అనిపిస్తే బియ్యప్పిండి వేసి కలపాలి. ఇప్పుడు పిండిని ప్లాస్టిక్ కవర్లో వేసి దానికి రంద్రం పెట్టి కాస్త పెద్ద సైజు చెగోడీ మాదిరిగా గుండ్రంగా చుట్టినట్లుగా చేసి కాగిన నూనెలో వేసి బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించి తీసుకోవాలి. అంతె సింపుల్గా సెల్ రోటి రెడీ.

No comments:
Post a Comment