Thursday, March 21, 2019

దంపతులిద్దరూ చెరో పార్టీలో……


శ్రీకాకుళం ,న్యూస్‌టుడే:
1)ఈ సారి ఎన్నికల్లో పురందేశ్వరి,ఆమె భర్త  దగ్గుబాటి ….
2)అధిష్టానం పురందేశ్వరి పేరును ఖరారు…..
అమరవతి: ఈసారి ఎన్నికల్లో  పురందేశ్వరి, ఆమె భర్త  దగ్గుబాటి  వెంకటేశ్వరరావు  వేర్వేరు  పార్టీ  అభ్యర్ధులుగా  పోటీ చేయడం   ఆసక్తికారంగా  మారింది.పురందేశ్వరి విశఖ బీజేపి  లోక్ సభ  అభ్యర్ధి  రంగంలోకి  దిగుతున్నారు.ఆమె లోక్ సభ స్ధానానికి  పోటీచేయడం  ఇది నాలుగోసారి.  పర్చూరు శాసనసభ  స్ధానం  నుంచి దగ్గుబాటి  వైసీపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. విశాఖ లోక్ సభ నుంచి  బీజేపీ  సిట్టింగ్ ఎంపీ కంభంపాటి హరిబాబు  పోటీ  చేసేందుకు  విముఖత  వ్యక్తం  చేయటంతో  అధిష్టానం  పురందేశ్వరి పేరును ఖరారు చేసింది.అమెరికా లో స్ధిర పడ్డ తన కుమారుడు  హితేశ్  చెంచురాంను  వైసీపీ  తరపున  పోటీ  చేయాలని  భావించినా  అమెరికా పౌరసత్వం  కారణంగా ఆయనకు అవరోధం ఏర్పడింది.    

No comments:

Post a Comment