విశాఖపట్నం అడివివరం, న్యూస్‌టుడే:ముఖ్యంశాలు:* సాంప్రదాయం గానిశ్చితార్థ మహోత్సవం.. ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం అప్పన్న స్వామి డోలోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సింహగిరిపై అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి రంగుల చూర్ణాలతో బేడామండపం ప్రదక్షిణం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకీలో అధిష్ఠింపజేసి మెట్లమార్గం ద్వారా కొండ దిగువకు తీసుకువచ్చారు. తొలుత శ్రీపైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న స్వామి పుష్కరిణి సత్రంలోని ఉద్యాన మండపంలో ఆశీనులయ్యారు. మండపంలో ఉయ్యాలలో స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి డోలోత్సవం కనులపండువగా జరిపించారు.

No comments:
Post a Comment