విశాఖ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..
*జిల్లా లో మరోసారి అధినేతల పర్యటనలు…
సార్వత్రిక పోరుకు సంబంధించి ప్రధాన పార్టీలు ఓట్ల వేట దిశగా పావులు కదుపుతున్నాయి. సమయం తక్కువగా ఉండటంతో నేతలంతా ప్రచార బాట పడుతున్నారు. ఓటర్లకు దగ్గరయ్యేందుకు అధినేతలతో ప్రచార సభలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరోమారు జిల్లాకు వస్తున్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరాట్ కూడా రానుండటంతో జిల్లాలో ప్రచార వేడి రాజుకుంది. మరోవైపు గడువు ముంచుకొస్తోంది. ముహూర్తాలు చూసుకుని ఒక్కొక్కరు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గ కేంద్రాల్లో కోలాహలం నెలకొంది. అభ్యర్థులతో పాటు వారి బంధువులు, కుటుంబ సభ్యులంతా రంగంలోకి దిగి ప్రచారాలు మొదలుపెట్టారు. ప్రధానంగా తెదేపా, వైకాపా అభ్యర్థుల ప్రచారాలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో తెదేపా దూకుడు పెంచగా.. వైకాపాలో మాత్రం టిక్కెట్లు రాని వారికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. జనసేన నేతలు కూడా ప్రచార జోరు పెంచారు. తమ అధినేత పవన్ కళ్యాణ్‌తో రోడ్డుషోలు ఏర్పాటు చేసుకునేలా ప్రణాళిక చేసుకుంటున్నారు.

No comments:
Post a Comment