కురబల కోట న్యూస్‌టుడే:
* ఐటీ రిటన్స్ దాఖలు చేసిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే పది రెట్లు పరిహారం
*మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆడ్మీనిస్ట్రేటివ్ ఆఫీసర్ వెల్లడి.
మూడేళ్ల పాటు ఐటీ రిటన్స్ దాఖలు చేసిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి ఆదాయాన్ని బట్టి పది రెట్లు పరిహారం పొందే అవకాశం ఉందని అంగళ్లులోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆడ్మీనిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎంహెచ్ దాదాపీర్ తెలిపారు.గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక భరోసా విషయం చాలా మందికి తెలియక నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మూడేళ్ల పాటు రిటన్స్ దాఖలు చేసి ఉండాలన్నారు. ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే అతని వార్షిక ఆదాయాన్ని బట్టి పదిరెట్లు పరిహారం ఇవ్వాలని చెబుతున్నారు.ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉంటే అతను ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి పదిరెట్లు అంటే రూ.50 లక్షలు పరిహారం లభిస్తుందన్నారు.ప్రమాదం జరిగిన ఆరు నెలల్లోపు క్లైం చేసుకోవాలన్నారు.దీనిపై ప్రజలకు అవగాహాన కల్పిస్తున్నాట్లు ఆయన తెలిపారు.

No comments:
Post a Comment