Friday, March 1, 2019

కలుషిత ఆహారం తిని ఆస్వస్థత కు…

శ్రీకాకుళం పెద్దరావుపల్లి న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
  • అయితే టిఫిన్‌ తిన్న వారందరికి వాంతులు…
  • యాత్రకు వెళ్లలేమని చెప్పడంతో ట్రావెల్‌ ఏజెన్సీ వారు…
తీర్థయాత్రకు వెళ్తుండగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 42 మంది మంగళవారం ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరి వెళ్తూ కోటబొమ్మాళి సమీపంలో రాత్రి సమయంలో ట్రావెల్‌ ఏజెన్సీ వారు అందించిన టిఫిన్‌ తిని తీవ్ర అస్వస్థతకు గురి కాగా ప్రస్తుతం బాధితుల్లో పలువురు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. సంఘటన వివరాల్లోకి వెళ్తే..పెద్దరావుపల్లి గ్రామానికి చెందిన 12 మందితో పాటు ఎచ్చెర్ల, పోలీసు క్వార్టర్సు, జరజాపుపేట, అరసవల్లి, కోటబొమ్మాళి, సింగుపురం గ్రామాల నుంచి 30 మంది యాత్రికులు ఉత్తర భారతదేశ యాత్రకు ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మంగళవారం బయలుదేరి వెళ్లారు. పెద్దరావుపల్లి గ్రామానికి చెందిన 12 మందిలో 10 మంది పరిస్థితి విషమించడంతో వారిని గురువారం తెల్లవారు జామున 108 వాహనంలో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. . ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంపీడీవో తెలిపారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి నారాయణమ్మ, తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment