కడప న్యూస్‌టుడే:
*ఒకే పదవి కోసం పలువురు నేతలు పోటీ.
*వీరు టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద పట్టుబట్టినట్లు సమాచారం.
కడపజిల్లా తెదేపాలో ఎమ్మెల్సీ సీటు కోసం కోలాహలం మొదలైంది.ఒకే పదవి కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు.రైల్వేకోడూరు నుంచి తెదేపా నాయకుడు విశ్వనాథనాయుడు,కమలాపురం నుంచి వీరశివారెడ్డి అధినేత చంద్రబాబు వద్ద పట్టుబట్టినట్లు సమాచారం.భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామంటూ ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటీకే జమ్మలమడుగు టికెట్ల సర్దుబాటులో భాగంగా ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా రామసుబ్బరెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయిస్తుండటం తెలిసిందే.ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి దాన్ని ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇచ్చేలా కసరత్తు జరిగింది. ఆది సోదరుడి కుమారుడుకి అవకాశం కల్పించేందుకు ఖరారు అవడంతో ప్రస్తుతం జిల్లా నేతల్లో ఉత్కంఠ మొదలైంది.

No comments:
Post a Comment