హైదరాబాద్ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….
*నకిలీ కొబ్బరి నూనెను తయారు చేస్తున్నదుండగులు…..
*వారిపై విజిలెన్స్ దాడి……
నకిలీ కొబ్బరి నూనెను తయారు చేస్తున్న స్థావరంపై రంగారెడ్డి జిల్లా విజిలెన్స్,ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడిచేశారు.రూ.25 లక్షల విలువగల 150 కిలోల కొబ్బరినూనె స్వాధినం చేసుకున్నారు. నగరంలో నివసిస్తున్నా సుభాష్ అలియాస్ వివేక్ గుప్త ఓ భవనం అద్దెకు తీసుకుని 8 మంది సిబ్బందితో పారాచూట్ బ్రాండెడ్ డబ్బాల్లో తయారు చేసిన నకిలీ కొబ్బారినూనె నింపి మార్కెట్లో విక్రయిస్తున్నారు.కంపెనీ యాజమాన్యానికి అనుమానం రావడంతో రంగారెడ్డి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థావరంపై దాడి చేసి యంత్రాలు, పారాచూట్ లేబుల్స్, 150 డబ్బాలలో నింపిన నూనెను స్వాధీనం చేసుకొన్నారు. సుభాష్ పరారీలో ఉన్నాడని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న సామగ్రిని పేట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.
No comments:
Post a Comment