గుంటూరుజిల్లా:మంగళగిరి: న్యూస్‌టుడే:
*1వ వార్డు నుంచి 7వ వార్డుల వరకు ప్రచార కార్యక్రమాలు…
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శుక్రవారం మంగళగిరిలో నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం సీతారామకోవెల గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ర్యాలీగా బయలు దేరి హుస్సేన్ కట్ట, గౌతంబుద్ధ రోడ్, మిద్దె సెంటర్, ద్వారకా నగర్, లక్ష్మీనరసింహ స్వామి గుడి మీదుగా మెయిన్ బజార్ చేరుకున్నారు. అక్కడనుంచి మిద్దె సెంటర్, గౌతం బుద్ధ రోడ్ మీదుగా మంగళగిరి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేయనున్నారు. తదనంతరం మంగళగిరి ఆర్బన్‌లోని 1వ వార్డు నుంచి 7వ వార్డుల వరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలుత్గదితరులు పాల్గొననున్నారు.
No comments:
Post a Comment