గుంటూరుజిల్లా:రేపల్లె: న్యూస్‌టుడే:
* విద్యుత్తు దీపాలతో అలంకరించిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణ…
రేపల్లె మండలంలోని బేతపూడి గ్రామ దేవత బేతపూడమ్మ తల్లి తిరునాళ్ల రాత్రి వైభవంగా జరిగింది. అమ్మవారికి పసుపు, కుంకుమ గాజులు, వస్త్రాలు సమర్పించి భక్తులు మొక్కుబడి తీర్చుకున్నారు. గుడి ఆవరణలో విద్యుత్తు దీపాలతో అలంకరించిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఇతర నాయకులు అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు

No comments:
Post a Comment