హైదరాబాద్ న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు……
*1986లో జన్మించిన సాయినాథ్‌యాదవ్ వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు…..
లోక్‌సభ ఎన్నికల బరిలో టీఆర్ ఎస్ నుంచి పోటీ చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్‌యాదవ్ అందరిలోనూ అతి చిన్న వయస్కుడు. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులలో సాయికిరణ్‌యాదావ్ చిన్నవాడు. 1986లో జన్మించిన సాయినాథ్‌యాదవ్ వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి సాయికిరణ్ రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన గెలిస్తే అతి పిన్న వయసు ఉన్న ఎంపీల జాబితాలో చేరుతారు. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారిలో 32 మంది ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్‌నాయుడు స్థానం సంపాదించుకున్నారు.

No comments:
Post a Comment