Thursday, March 21, 2019

మనస్పూర్తిగా కలిసి పనిచేస్తాం………


విశాఖపట్నం సబ్బవరం, న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……
గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే బండారు సబ్బవరం మండలం మొగలిపురంలోని గండి బాబ్జీ నివాసానికి వెళ్లారు.  ఉప్పు, నిప్పులా ఉండే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ప్రస్తుత ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కలిసిపోయారు. గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే బండారు సబ్బవరం మండలం మొగలిపురంలోని గండి బాబ్జీ నివాసానికి వెళ్లారు. సుమారు గంటసేపు ఇద్దరు ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. తమలో ఎటువంటి అరమరికలు లేవన్నారు. అంతా కలిసి పనిచేసి తెదేపా విజయానికి పని చేస్తామన్నారు. కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పోరుకు సిద్ధం కావాలని కోరారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ బాబ్జీ కలయిక వల్ల కార్యకర్తల్లో కొత్త ఊపు కనిపిస్తోందన్నారు. ఈ ఉత్సాహం చివరి వరకు కొనసాగాలని కోరారు. వీరిద్దరు కలవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన కృషి కారణమని తెలుస్తోంది. సీఎం ఇచ్చిన హామీకి కట్టుబడి బాబ్జీ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎమ్మెల్సీ స్థానం మొదట ఎక్కడ ఖాళీ అయితే అక్కడ బాబ్జీకి అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇలా ఒకరి విజయానికి మరొకరు కట్టుబడి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆంతరంగిక మిత్రుల ద్వారా తెలిసింది.
                                                                         

No comments:

Post a Comment