Thursday, March 21, 2019

సాక్ష్యాలు దొరికాయి వివేకా హంతకులు వీరేనా…?


కడప న్యూస్‌టుడే:
వివేకా హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది.హత్య కేసులో అనుచరులే ప్రధాన నిందితులని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గంగిరెడ్డి,పరమేశ్వర్ రెడ్డి ప్లాన్‌తోనే హత్య జరిగినట్టు నిర్ధారణ చేసినట్టు తెలుస్తుంది.గంగి రెడ్డి,పరమేశ్వర్ రెడ్డి,శేఖర్ రెడ్డిని పోలీసులు విచారుస్తున్నారు.వివేకాను హత్య చేసింది శేఖర్ రెడ్డి అని పోలీసులు భావిస్తున్నారు.హత్య జరిగిన రాత్రి 11-12గంట్ల మధ్య పులివెందులలో స్కార్పియోలో శేఖర్ రెడ్డి తిరిగినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ లభ్యమైంది.చిన్నా అనే రౌడీ షీటర్ స్కార్పియోలో వారంపాటు శేఖర్ రెడ్డి తిరిగారు.గంగి రెడ్డి అనుచరులు నాగప్ప,మధు పోలీసుల అదుపులో ఉన్నారు.ఆర్ధిక లావాదేవీల్లో వివాదమే హత్యకు కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.

No comments:

Post a Comment