గుంటూరుజిల్లా:తెనాలి: న్యూస్‌టుడే:
.* 11వ తేదీన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే జయంతి…
* రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పూలే జయంతి ఉత్సవ నిర్వహణకు అవకాశం లేకుండుట…
ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 11వ తేదీన జరుగుతున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సామాజిక సేవా కార్యకర్త విజయ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. “ప్రతి ఏటా ఏప్రిల్ 11వ తేదీన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే జయంతి జరుగుతుంది. అదే రోజు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పూలే జయంతి ఉత్సవ నిర్వహణకు అవకాశం లేకుండా పోతుంది. అందువల్ల ఆ రోజు నిర్వహించతలపెట్టిన ఎన్నికను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినా ఫలితం లేకుండాపోయింది. అందువల్ల మొదటివిడతగా నిర్వహించతలపెట్టిన ఎన్నికకు ఈసీ జారీ చేసిన ప్రకటనను రద్దు చేయడంతో పాటు, ఆ ఎన్నికను వాయిదా వేసేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించండి” అని కోరుతూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో ఎన్నికల కమిషన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రతివాదులుగా చేర్చారు.
No comments:
Post a Comment