రాజమహేంద్రవరం న్యూస్‌టుడే:
*మురళి మోహన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకునట్లు సమాచారం….
*తాను ఏర్పాటుచేసిన ట్రుస్టు కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది…..
రాజమహేంద్రవరం ఎంపి మురళి మోహన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకునట్లు సమాచారం.అయితే ఆయన కోడలు రూప కూడా పోటీ చేయకూడదని భావిస్తున్నట్లు ఆయన అనుచరుల్లో ప్రచారం జరుగుతుంది.కాగా ఇక నుండి తాను ఏర్పాటుచేసిన ట్రుస్టు కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది.ఈరోజు అమరావతిలో రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు,ఎంపీ అభ్యర్ధులపై చంద్రబాబు సమీక్షించనున్నారు.మురళీమోహన్ కూడా హాజరు కానున్నారు.ఆ సందర్భంగా తన నిర్ణయాన్ని సీఎంకు స్వయంగా తెలియజేయనునట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

No comments:
Post a Comment