మోసూల్ :న్యూస్‌టుడే:
*55మందిని రక్షించామని అధికారులు చెప్పారు
* ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశాలు జారీ చేశామని ఇరాక్ న్యాయశాఖ మంత్రి చెప్పారు.
ఇరాక్ దేశంలోని టైగ్రిస్ నదిలో పడవ మునిగి 19 మంది పిల్లలతో సహా 94 మంది మరణించారు. కుర్ధిష్ కొత్త సంవత్సరం సందర్భంగా కొందరు తమ కుటుంబసభ్యులతో కలిసి ఉత్సవం చేసుకునేందుకు పడవలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పిక్నిక్ కోసం నౌరుజ్ వెళ్లేందుకు టైగ్రిస్ నదిలో పిల్లలు, మహిళలతో కలిసి వెళుతుండగా పడవ ప్రమాదవశాత్తూ మునిగింది. పడవలో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో బోల్తా పడిందని అధికారులు చెప్పారు. ఈ పడవ ప్రమాదంలో 94 మంది మరణించగా 55మందిని రక్షించామని అధికారులు చెప్పారు. నదిలో నీటి ప్రవాహం పెరగడంతోపాటు కెపాసిటీ కంటే అధికంగా ప్రయాణికులు ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఈ పడవ ప్రమాద ఘటనలో పడవల కంపెనీకి చెందిన 9 మంది అధికారులను అరెస్టు చేసి, ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశాలు జారీ చేశామని ఇరాక్ న్యాయశాఖ మంత్రి చెప్పారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలతోపాటు మోసుల్ డ్యాం నుంచి నీటిని నదిలోకి విడుదల చేయడంతో ఈ ప్రమాదానికి మరో కారణమని అంటున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు..

No comments:
Post a Comment