Friday, March 1, 2019

ఎంపీ అభ్య‌ర్దిగా కోడెల‌……..

ఏపి శాస‌న‌స‌భా స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ లోక్‌స‌భ బ‌రిలోకి దిగటం దాదాపు ఖాయ‌మైంది. ఆయ‌న ప్ర‌స్తుతం గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక‌, ఆయ‌న త‌న‌యుడు శివ‌రాం ను న‌ర్స‌రావు పేట ఎమ్మెల్యేగా బ‌రిలోకి దింపాల‌ని టిడిపి అధినేత నిర్ణ‌యించారు.
స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద రావు రానున్న ఎన్నిక‌ల్లో న‌ర్స‌రావుపేట ఎంపీగా పోటీ చేయ‌టం దాదాపు ఖాయ‌మైంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి అసెంబ్లీ నుండి వైసిపి నేత అంబ‌టి రాంబాబు మీద గెలుపొందారు. స‌త్తెన‌ప‌ల్లి లో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అయితే, ప‌ల్నాడు ప్రాంతంలో ప‌ట్టు ఉన్న కోడెల ను న‌ర్స‌రావు పేట ఎంపీగా బ‌రిలోకి దించ‌టం ద్వారా మేలు జ‌రుగుతుంద‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్నారు. దీంతో..ఆయ‌న ఎంపీగా బ‌రిలోకి దిగ నున్నారు. అయితే, త‌న కుటుంబానికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల‌ని కోడెల ప్ర‌తిపాదించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందు లో భాగంతా న‌ర్స‌రావు పేట ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు సీయం అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం న‌ర్స‌రావు పేట ఎంపీగా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి ఆరోగ్యం స‌హ‌క‌రించ‌టం లేదు.

No comments:

Post a Comment